'చంద్రబాబు పాలనలో విశాఖ రివర్స్ గేర్‌'

Updated By ManamSun, 09/09/2018 - 18:33
Vizag, reverse gare, rulling for 4 years, Chandrababu naidu 

Vizag, reverse gare, rulling for 4 years, Chandrababu naidu విశాఖపట్నం: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరుకుంది. విశాఖలోని కంచరపాలెంలో ఆదివారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడారు. వైఎస్ హయాంలో విశాఖలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో విశాఖ రివర్స్ గేర్‌లో వెళ్తోందని జగన్ విమర్శించారు. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును వైఎస్ నిలబెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పేదల కోసం వైఎస్ఆర్ వేల ఇళ్లను కట్టించారని అన్నారు.

బీజేపీతో ఉన్నప్పుడు చంద్రబాబుకు రైల్వేజోన్, ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని, బీజేపీతో విడాకులు తీసుకున్నాక ఇప్పుడు రైల్వేజోన్, హోదా గుర్తుకొచ్చాయని విమర్శించారు. నాలుగున్నరేళ్లు మొదటి భార్య మంచిదెలా అయ్యిందో చెప్పాలన్నారు. విశాఖలో ఎక్కడైనా ఐటీ సిగ్నేచర్ టవర్స్ కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. ఉన్న పోర్టులో ఉద్యోగాలు పోతుంటే డీప్ వాటర్ పోర్ట్ కడతారట అని జగన్ ఎద్దేవా చేశారు. కాగా, వైఎస్ జగన్ భారీ బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. 

English Title
Vizag reverse gare rulling for 4 years of Chandrababu naidu 
Related News