జ్యోతికను కలవాలనుకుంటున్నారా..? ఇదుగో చాన్స్

Updated By ManamThu, 04/19/2018 - 09:29
Jyothika

Jyothikaసినీ నటి జ్యోతికను కలవాలనుకుంటున్నారా..? ఆమెతో ఒక రోజంతా సరదాగా గడపాలనుకుంటున్నారా..? అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే.. అదేంటంటే ఆమె తదుపరి చిత్ర టైటిల్‌ను గెస్ చేయడమే. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న జ్యోతిక ‘తుమ్హారీ సులు’ తమిళ రీమేక్‌లో నటించనుంది. జూన్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికర పోటీని పెట్టింది.

ఈ మూవీకి టైటిల్‌ను గెస్ చేసిన పది మంది లక్కీ విన్నర్స్‌కు జ్యోతికను కలిసే అవకాశం ఉంటుందని తెలిపింది. జ్యోతికను మాత్రమే కాదు ఆ మూవీ యూనిట్ మొత్తంతో కలిసి సరదాగా ఒక రోజు గడిపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 20తో ముగియనున్న ఈ కాంటెస్ట్ కోసం టైటిల్ రెండు అక్షరాలు మాత్రమే ఉంటుందన్న క్లూ కూడా ఇచ్చారు. ఇక ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తుండగా.. ధనుంజయంగ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

English Title
Want to meet Jyothika..?
Related News