మాలిక్‌ను ధోనీతో పోల్చిన వసీం అక్రమ్

Updated By ManamSun, 09/23/2018 - 01:01
vasim akram

imageన్యూఢిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా శుక్రవారం అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధించాలంటే చివరి ఓవర్లో 10 పరుగులు చేయాలి. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేశారు. అయితే ఆసమయంలో అఫ్ఘానిస్థాన్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, పాక్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి మరో మూడు బంతులు మిగిలుండగానే తమ జట్టుకు గొప్ప విజయాన్ని అందించాడు. మాలిక్‌పై సీనియర్ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురుపించారు. పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ట్విటర్ ద్వారా మాలిక్ ఆటపై ప్రశంసలు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో మాలిక్ బ్యాటింగ్ చూస్తుంటే అచ్చం ధోనీలా కనిపించిందన్నాడు. ధోనీ కూడా చివర్లో ఇలానే ఒత్తిడికి లోనవ్వకుండా మ్యాచ్‌లను ఫినిష్ చేస్తాడని అక్రమ్ అన్నాడు.

English Title
Wasim Akram who compared Malik to Dhoni
Related News