ఏలియన్స్‌లా భయపెట్టిస్తున్న ‘శునక’ రోబోలు!

Updated By ManamTue, 02/13/2018 - 14:15
Boston Dynamics, taught its robots, open doors, it has people terrified

Boston Dynamics, taught its robots, open doors, it has people terrifiedన్యూఢిల్లీ: మానవ మేధస్సు ఎంత గొప్పదో చెప్పనక్కర్లేదు. మనిషి రూపొందించిన కృతిమ రోబోలు.. భవిష్యత్తులో ఆ మనిషి మనుగడనే శాసించేలా కనిపిస్తున్నాయి. బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ ఇటీవల రూపొందించిన శునక రోబోలు (రోబో డాగ్స్) ఎటువంటి సాయం లేకుండా తలుపులను అవలీలగా తెరుస్తున్నాయి. శునక రోబోల పనితీరును చూస్తే హాలీవుడ్ సినిమాల్లో ఏలియన్స్ నిజంగా బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా భయానక దృశ్యం కనిపిస్తోంది. మసాచుసెట్స్ ఆధారిత రోబోటిక్స్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ స్పాట్‌మినీ రోబోలను పునఃరూపకల్పన చేసింది. ఈ శునక రోబోలు పనితీరులో కేవలం కిందికి పైకి నడవడం మాత్రమే కాదు ఏకంగా గదిలో మూసిన తలుపును కూడా అమాంతం లాగి బయటకు వెళ్లగలవు.

గత ఏడాది నవంబర్‌లో స్పాట్ మినీ రోబోలను తొలిసారి ఆవిష్కరించారు. ఈ రోబోల పనితీరుకు సంబంధించి బోస్టన్ డైనమిక్స్ కంపెనీ సోమవారమే 45 సెకన్ల నిడివి గల వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియోను ‘హే బడ్డీ, క్యాన్ యూ గీవ్ మీ ఏ హ్యాండ్’ అనే టైటిల్ పేరుతో విడుదల చేశారు. ఆ వీడియోలో రోబో శునకాలు నాలుగు కాళ్లతో నడుస్తూ అచ్చం శునకాల్లా ప్రవర్తిస్తూ తలుపు తెరిచిన దృశ్యం సోషల్ మీడియాలో చాలామందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆ వీడియోను మీరూ చూడండి..

English Title
Watch: Boston Dynamics taught its robots to open doors – and it has people terrified
Related News