నీటి కరువు

Updated By ManamWed, 02/14/2018 - 23:28
Water drought

Water droughtఆకస్మిక వాతావరణ మార్పు ప్రమాదంలో ప్రపంచం (ప్రకృతి+సమాజం) కూరుకోబోతుందన్న మరణమృదంగాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా దాహం తీర్చే మంచినీటి కరువు మానవాళిని కబళించబోతోందనడానికి దక్షిణా ఫ్రికా నగరం కేప్‌టౌన్  దృశ్యం ఒక సంకేతంగా నిలుస్తుంది. అభివృద్ధి పేరిట మొ లుచు కొస్తున్న ఆకాశహర్మ్యాల్లో నాగరికతలు వెలసిన నీటి పునాదులు మరచి మానవాళి పరాయికరణకు గురైన క్రమంలో కాంక్రీట్ నిర్జీవ సంస్కృతిగా సర్వత్రా విస్తరించింది. సమాజం-ప్రకృతి మధ్య సాగే ఆదానప్రదాన క్రమానికి గండివేసే పట్టణీకరణ పునాదిగా సాగే పారిశ్రామికరణ, కాగితపు కరెన్సీల మోజులో, సంపదల పేరాశతో కోట్లాదిమంది సృష్టించిన సంపదలకు కొద్ది మం దిని భుక్తందారులను చేయడమే కాదు, భూ వనరులను దుర్వినియోగ పరుస్తూ మానవ మనుగడ ను ప్రశ్నార్థకంగా మార్చివేసింది. పట్టణాల్లో ఒదుగుతున్న ప్రపంచానికి కేప్‌టౌన్ తాగునీటి సంక్షోభం తీవ్ర హెచ్చరిక అవుతుంది. పాలకుల కార్పొరేట్ ప్రపంచీకర ణ మోజు ప్రజల పాలిట శాపంగా మారింది.


ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాలు భవిష్యత్ లో నీటి కోసం భారీస్థాయి యుద్ధాలు జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నాయి.  2015లో పావోలో బాసిగలుపి రాసిన ‘ద వాటర్ నైఫ్’, క్లైరే వాయె వాట్కిన్స్ రాసిన ‘గోల్డ్ ఫేమ్ సిట్రస్’ అనే రెండు వైజ్ఞానిక కాల్పనిక నవలలు అమెరికా లోని కేలిఫోర్నియా రాష్ట్రంలో నెలకొన్న ఘోరమైన నీటి కొరత సమస్యను ప్రతిబింబిస్తున్నాయి. వాస్తవంలో అమెరికా నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్రికా, భారత్ దాకా అత్యంత ప్రతిష్టాత్మకమైన, వారసత్వ సంపదగా ప్రసిద్ధిచెందిన మహా నగరాలు సైతం నీటి కొరతతో అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచంలోనే నీటి కొరతతో కుదేలైన మొట్టమొదటి ఆధునిక నగరం కేప్‌టౌన్‌లాగా మరో 11 మ హానగరాలు త్వరలో దాహాగ్నితో అల్లాడుతాయని బీబీసీ కథనం ఒళ్లుగగుర్పా టుకు గురిచేసింది. ఆ నగరాల జాబితాలో భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరు ఉండటం ఆందోళన కలిగించే విషయం. బెంగుళూరు నీటి కటకట, ట్రాఫిక్ సమస్యలతో చాలాకాలంగా కుతకుతలాడుతుండటం తెలిసిందే. దేశంలో అనేకప్రాంతాల్లో భూ ఉపరితల, భూగర్భ జలాలు ఆందోళనకరమైన స్థా యిలో అడుగంటిపోయాయి. నీటికొరత సమస్య ఆందోళనకరస్థాయిలో వేధిస్తు న్నా భారత పాలకులు అత్యంత నిర్లక్ష్యంతో, హ్రస్వదృష్టితో, నత్తనడకన సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుండడం దారుణం. దాహం వేస్తేగాని బావితవ్వుకోడా నికి సిద్ధపడని ప్రభుత్వాల వైఖరి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. మనకంటే చిన్న, వెనుకబడిన, అరకొర వనరులున్న దేశాలు సైతం ప్రపంచీ కరణ, సాంకేతిక ప్రగతిని వినియోగించుకొని తాగునీటి సమస్యను పరిష్కరిం చుకుంటున్నాయి.


వేగవంతమైన నీటి వినిమయం పునాదిగా రూపొందే వ్యవసాయోత్పత్తుల ద్వారా ‘అంతర్ జలం’ (వర్చ్యువల్ వాటర్)ను ఎగుమతి చేయడంలో భారత్ ముందంజలో ఉంది. అదే సమయంలో దేశంలోని సహజ వనరులను కాలుష్యం, దుర్వినియోగం బారినుంచి కాపాడుకోలేని దుస్థితిలో ఉంది. ప్రాచీన కాలం నుంచి ‘హైడ్రాలిక్ రాజ్యాలు’గా ప్రసిద్ధికెక్కి, నీటియాజమాన్యంలోను, ‘జలశక్తి’ వినియోగంలోనూ నిష్ణాతులైన భారతీయులు నేడు నీటి సంరక్షణలో ఘోరంగా విఫలం కావడం దురదృష్టకరం. దేశంలోని నదులు పరిశ్రమలు, స్థానిక నగరాలకు డ్రైనేజీ వ్యవస్థలుగా మారిపోయేందుకు దోహదం చేసిన పాలకుల విధానాలు చారిత్రక వైఫల్యాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో విచక్షణారహితంగా పెరిగిన పట్టణీకరణ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనేక నీటి వనరులను, జలప్రవాహ మార్గాలను, స్థానిక భూగర్భ జలాశయాల ను కబళించాయి లేదా విధ్వంసం చేశాయి. గంగా, యమునా పరివాహక ప్రాం తాలు, బెంగుళూరు, హైదరాబాద్ నగరాలలో వేలాది చెరువులు, కుంటలు మా యం కావడము, నీటి ప్రవాహమార్గాలు మూసుకుపోయి మురికి/చెత్త నిల్వ కేం ద్రాలుగా మారాయి.  నీటికరువు బారిన పడబోయే ఆధునిక నగరాల్లో బెంగ ళూరు కూడా ఉండడం భారత నగరాల దుస్థితి గురించి హెచ్చరించే ప్రమాద ఘంటికగా పాలకులు పరిగణించి యుద్ధప్రాతిపదికన తక్షణ రక్షణ చర్యలను జాతీయ స్థాయిలో చేపట్టాలి. కార్పొరేట్ అత్యాశ ప్రకృతిలోని సహజ ప్రక్రియలను గందరగోళపరిస్తే, ప్రకృతి తిరిగి మానవాళిపై వైపరీత్యాలు, కరువులు రూపంలో పగ తీర్చుకుంటుంది. 
 

English Title
Water drought
Related News