అంగారకుడిపై నీటి ఆనవాళ్లు?

Updated By ManamMon, 02/19/2018 - 04:31
Water moons on Mars?

Water on Marsఅంగారకుడిపై నీటి ఆనవాళ్లు కనుగొనేందుకు నాసా శాస్త్రవేత్తలకు మార్గం సుగమం అయ్యింది. అరుణ గ్రహంపై ‘పర్సెవరెన్స్ వ్యాలీ’ గా పిలుస్తున్న ప్రాంతంలో నీటిని పోలిన చారలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) గుర్తించింది. ఇవి నీటి చారలే అయ్యుంటాయని ఆ సంస్థ అభిప్రాయపడింది. 2004 లో ప్రయోగించిన మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ప్రత్యేకమైన ఈ చారలను గుర్తించింది. పర్వత వాలు ప్రాంతాల్లో నీటితో కూడుకున్న మట్టి గడ్డకట్టి ఇలాంటి చారలు ఏర్పడే అవకాశముందని నాసా పరిశోధకులు తెలియజేస్తున్నారు. నాసా ప్రయోగించిన ‘మార్స్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ రోవర్‌ ఆపర్చునిటీ’ అరుణగ్రహంపై ఐదువేల రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నీటి ఆనవాళ్లను పోలి ఉన్న చిత్రాలను గుర్తించింది. వీటి ఆధారంగా మరింత లోతుగా పరిశోధనలు చేసి అంగారకుడిపై నీటి జాడ గుట్టును తెలసుకోనున్నట్లు తెలిపారు. 

English Title
Water moons on Mars?
Related News