జలజాలం.. జనహితం 

Updated By ManamThu, 06/21/2018 - 02:19
cm kcr

imageఈ సృష్టిలో ఎక్కడైతే నీరు ప్రవహిస్తుందో అక్కడే జీవం మనుగడ సాగిస్తుంది. మానవ మనుగడకు జలమే మూలం, జీవకోటికి నీరే ఆధారం. నీటి కోసం నాడు భగీరథుడు గంగను నేలకు తీసుకొచ్చాడు. నేడు కేసీఆర్ భగీరథయత్నంతో ప్రతి గడపకు తీసుకొస్తు న్నారు. తెలంగాణాలో సకల జల వనరులు ఉన్నప్పటికీ అవి తరలింపునకు గురయ్యాయి. మన దగ్గర నీళ్ళ కోసం గత పాల కులు ప్రాజెక్టులు మొదలెట్టినా అవి శిలాఫలకాలకే పరిమితమయ్యాయి ఆచరణకు నోచు కోలేదు. ఇక్కడ నీళ్ళను, నిధులను, సంపదను మళ్ళిం చి ఇక్కడ ప్రాంత ప్రజలకు కన్నీళ్ళను మిగిల్చారు. వారి భవిష్యత్ కోసం ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెట్టారు. నీళ్ళు పారాల్సిన పొలాల్లో రైతుల కన్నీళ్ళు పారాయి. 

ఆనందంతో ఉండాల్సిన రైతు ఉరికొయ్యలకూగిండు. ఇదే గత పాలకుల ఘనత
జలం విలువ తెలిసినవాడు జగతిని జయించ గలడు. తెలంగాణా ఏర్పాటు అనంతరం ఉద్యమ లక్ష్యా లైన  తాగునీరు, సాగునీటి రంగానికి అధిక ప్రాధా న్యత ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నికలు అయిపోగానే గెలుపోటములతో సంబంధం లేకుండా సాగునీటి రంగ నిపుణులతో అనేక చర్చలు జరిపారు. తెలంగాణా నీటిపారుదల రంగం గొప్పగా ఉండాలని, రైతుల పొలా ల్లో నీళ్ళు పారి అన్నదాత ఆనందంగా ఉండాలని వారికి హరీష్ రావు లాంటి చురుకైన వ్యక్తిని మంత్రిగా అప్ప జెప్పారు. తెలంగాణాలో అణువనువు కేసీఆర్‌కు మంచి పట్టు ఉంది. నీటిని సరైన మార్గంలో వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చునని నీటిరంగ నిపుణుల సహకారంతో తానే ఇంజనీర్‌గా మారి ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారు. ఆ అద్భుత ఆలోచనకు ఆచరణ రూపమే నేడు దేశమే గర్విస్తున్న ‘కాళేశ్వరం ప్రాజెక్టు’!

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక అద్భుతం. దేశ ఇరి గేషన్ రంగానికే ఇది తలమానికం. ప్రాజెక్ట్‌ల నిర్మాణం అంటే శిలాఫలకం వేసి 10-20 ఏండ్లకు పూర్తిచేసే సంప్ర దాయం నుంచి 4 ఏండ్లలో ఇంత ప్రాజెక్ట్ పూర్తి చేయడం అని నిరూపిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. దీనికి కావాల్సింది గొప్ప నాయకత్వం, దాన్ని ఆచర ణలో పెట్టగల అనుచరగణం, అందరినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకు నడిపిస్తూ ప్రాజెక్ట్ పూర్తికి కృషిచేశారు  కేసీఆర్. నీళ్ళను ఎంత ఎక్కువ నిల్వచే సుకుంటే అంత త్వరగా కరువును దూరం చేయచ్చు. అందుకే చెరువులను  జల భాండాగారంలా మార్చుతూ మిషన్ కాకతీయతో చెరువుల నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచుకుంది తెలంగాణా సర్కార్. అడుగంటిపోతున్న భూగర్బ జలాలను తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఇదో గొప్ప ముందడుగు తెలంగాణాలో అధికంగా బోర్లు, బావులను నమ్ముకుని వ్యవసాయాన్ని చేస్తుం టారు. చెరువులను నింపడం ద్వారా గ్రౌండ్ వాటర్ లెవల్స్  పెరిగి బావులలో, బోర్లలో నీటి లభ్యత అధికం గా ఉండి రైతుకు మేలు జరుగుతుంది మిషన్ కాకతీయ ఫలితాలను కూడా తెలంగాణా చూస్తుంది.

నీటి పారుదల రంగం చాలా కఠినమైనది. నీళ్ళను వాడుకోవడంలో విఫలమైతే ఎప్పటికీ ఆ నష్టాన్ని భర్తీ చేయలేం. తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ సాధిం చడం అవసరం. రైతు మబ్బు మొహం చూడకుండా కాలువల ద్వారా నీళ్ళను పొలాలకు మలపాలి అనే సంకల్పంతో  కేసీఆర్  సుదీర్ఘంగా అధికారులు, నీటిరంగ నిపుణులతో చర్చలు జరిపి ఆ దిశగా అడుగులేశారు. కొత్త రాష్ట్రంలో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుండటం దేశాన్ని తెలంగాణా వైపునకు తిప్పింది. నీటి అవసరం తెలిసిన, నీటి రంగంపై అవగాహన ఉన్న పాలకులు ఉం టే ఎంతటి అనితరసాధ్యమైన లక్ష్యాన్నైనా చేధించవచ్చని నేడు తెలంగాణా నిరూపిస్తుంది. 

సాగునీరుతో పాటు తాగునీరు కూడా తెలంగాణాలో పెద్ద సమస్యగా ఉండేది. నీళ్ళ కోసం కిలోమీటర్లు బిందె లు ఎత్తుకుని తెచ్చుకునే దీన పరిస్థితి. ఇక్కడ వనరులు లేకనా? అవకాశాలు లేకనా? లోపం ఎక్కడుంది? ఆచరణలో ఉంది!! నీళ్ళను తమ ఆదాయవనరుగానే చూశారు గత పాలకులు కానీ ప్రజల ప్రాథమిక అవస రంగా చూడలేదు. సమస్యను అవగాహనాపరుచుకోవ టంలో, ఆచరణలో విఫలమయ్యారు గత పాలకులు. ఆ తప్పిదం నూతన తెలంగాణా చేయలేదు. కేసీఆర్ దూర దృష్టి భవిష్యత్ తరాలకు ఇబ్బందులకు దూరం చేయ నుంది. ఒక గొప్ప ‘భగీరథ’ ప్రయత్నం దాదాపు పూర్తికి సిద్దమైంది. ఇప్పటికే పలుచోట్ల ఫలాలు ప్రజలకు అందు తున్నాయి. ఇంటిటికి నల్లా రూపంలో ప్రతి ఇంటికి తాగునీరు అందుతుంది.

సాగు, తాగునీరు, సంక్షేమం, విద్య, వైద్యం ఇలా అన్నిరంగాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా తెలంగాణా ముందుకెళ్తోంది. నిర్ధేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తూ ప్రగతిబాటన నడుస్తోంది. విజయాలను సాధిస్తోంది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ పాలించడం రాదన్నోల్లకే గుణపాఠం నేర్పుతూ తెలంగాణా పురోగ మిస్తోంది. జలహితంతో జనహితంతో తెలంగాణా దేశం లోనే ముందువరుసలో నిలబడింది. జలం మూలం ఇదః జగత్ అనే మాటను అమలు చేస్తూ నీటిరంగంలో నూతన విప్లవాన్ని తీసుకొచ్చి దేశం గర్వించేలా తెలం గాణా పురోగమిస్తోంది. అవాంతరాలన్నీ దాటుతూ తెలంగాణా అభివృద్దిని ఆస్వాదిస్తోంది. జలంహితం, జనహితం తెలంగాణా అభిమతం. 

- తెలంగాణ విజయ్

English Title
Water for people
Related News