'కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చితీరుతాం'

Updated By ManamTue, 03/27/2018 - 13:54
Water resources, Crore Yards, Telangana State, Telangana assembly

Water resources, Crore Yards, Telangana State, Telangana assembly హైదరాబాద్: జాతీయ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ ఆదాయం ఎక్కువని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ఆదాయం 224 శాతం పెరిగిందని చెప్పారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘దేశం మొత్తంలో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ’ అని వ్యాఖ్యానించారు. జాతీయ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర ఆదాయం ఎక్కువని, పెంచిన సంపదను ప్రజలకు పంచుతున్నామని చెప్పారు. ఇది ప్రతిపక్షాలకు నచ్చడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అవినీతిని అరికట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఖర్చవుతున్న ప్రతి పైసాకు లెక్కుందని, అప్పు తెచ్చిన ప్రతి పైసాను ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఇప్పుడు ఎక్కడా పైరవీలు లేవని అన్నారు. ప్రాజెక్టుల కోసం విజయవంతంగా భూసేకరణ చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 26వేల మంది పనిచేస్తున్నారని, త్వరలో చాలా జిల్లాలకు గోదావరి నీరు రాబోతోందని కేసీఆర్ పేర్కొన్నారు కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చితీరుతామన్నారు.

English Title
Water resources should be given for Crore yards in Telangana state
Related News