తెలంగాణ సర్కార్‌కు రుణపడి ఉంటాం..

Updated By ManamWed, 08/22/2018 - 18:24
kerala floods victims medicine students

kerala floods victims

  • తెలంగాణ వాసులుగా గర్వ పడుతున్నాం

  • మంత్రి కేటీఆర్, కవిత చొరవతో క్షేమంగా ఇంటికొచ్చాం

  • కేరళలో చదవుకుంటున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కేరళ నుంచి రాష్ట్రానికి చేరిన వైద్య విద్యార్థినులు చెప్పారు. మరీ ముఖ్యంగా మంత్రి కేటీఆర్, ఎంపీ కవితల సేవల మరవలేమని.. వాళ్ల చొరవతోనే మేం ఈనాడు రాష్ట్రానికి వచ్చామన్నారు. కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు ఖమ్మంకు చెందిన మౌర్య రాఘవ్, వరంగల్‌కు చెందిన షారోన్ శార్వాణీలు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత గారి చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరడం పట్ల వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళితే.. మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపుకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ అంతస్తులో రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడి నుండి తమ పరిస్థితిని కుటుంబసభ్యులకు వివరించగా వారు నిజామాబాద్ ఎంపీ కవితకు సమాచారం అందించారు. అలాగే మంత్రి కేటీఆర్ కార్యాలయాన్ని సంప్రదించారు. ఎంపీ కవిత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే కేరళ అధికారులకు సమాచారమిచ్చారు. 

kerala floods victims

మంత్రి కేటీఆర్ కూడా కేరళ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులను అప్రమత్తం చేసారు. రైలు మార్గం పునరుద్ధరించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక కొట్టాయం నుంచి ఖమ్మం, వరంగల్‌కు విద్యార్థినులు చేరుకున్నారు. కవిత ఆదేశాల మేరకు ఖమ్మం చేరిన మౌర్య రాఘవ్ను తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేడు ఖమ్మం వెళ్లి పరామర్శించారు. పెద్ద విపత్తు నుండి బయటకు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తల్లిలాగా తమ సమస్యను అర్ధం చేసుకొని ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ పరిస్థితి వాకబు చేసిన ఎంపీ కవితకు డాక్టర్ మౌర్య, ఆమె తల్లి మంజుల కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో తమ ఇబ్బందులు మీడియాకు తెలిపారు. 

ktr and kavitha

మూడు రోజుల పాటు కూరగాయలు దొరక్కపోవడంతో దుంపలు ఉడికించుకొని తిన్నామని తెలిపారు. కొట్టాయంలో ఎక్కువ ప్రాంతాలు నీట మునగడంతో రైల్వే స్టేషన్ వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని తెలయడంతో తెలంగాణ  ప్రభుత్వం వినతి మేరకు అక్కడి కలెక్టర్ ప్రత్యేక ఎస్కార్టుతో రైల్వే స్టేషన్ చేర్చారని వారు తెలిపారు. తమ ప్రభుత్వం తమపై చూపించిన చొరవ పట్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని డా. మౌర్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర వాసి కావడం గర్వంగా ఉందని మౌర్య ఎంపీ కవితకు రాసిన లేఖలో తెలిపారు. మౌర్య కుటుంబ సభ్యులను బుధవారం నాడు కలిసిన వారిలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు పసుల చరణ్, జిల్లా నాయకులు రవికిరణ్, గట్టు కరుణ, వనం నాగేంద్ర, వీరభద్రరావు, అరవింద్ రెడ్డి, మనోజ్ తదితరులు ఉన్నారు.

kerala floods victims medicine students

English Title
We are grateful to Telangana Sarkar Says Kerala Floods Victims
Related News