నివురుగప్పిన అసంతృప్తి ఏ వేురకు?

Updated By ManamWed, 09/26/2018 - 01:19
MATHANAM

imageప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇవి తొలి ఎన్ని కలు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం కన్నా ముందే ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కమిషన్ అధికా రిక సమాచారంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగానే ఎన్ని కల ఫలితాలు చూపించారు. 2014లో ఎన్నికలు సమైక్య రాష్ట్ర పరిధిలోనే నిర్విహంచి అనంతరం రెండు రాష్ట్రాలుగా అధికారికంగా ఏర్పాటుచేశారు. అందువల్ల ప్రస్తుతం తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలంగాణలో తొలి ఎన్నికలవుతాయి. ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించ నున్నాయని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)  కలల కంటున్నది. ఎన్నికల హామీలు పరిపూర్తి చేయడంలో కొంత నిర్లక్ష్యం వహించినా, అనూహ్య సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకురావడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజాభిమానం చూరగొనేందుకు ప్రయత్నించారు. అధి కారంలోకి వచ్చాక ఏం చేశామో, మళ్ళీ అధికారం అప్పగిస్తే ఏం చేయబోతున్నారో ‘ప్రగతి నివేదన’ సభ ద్వారా అధికార పక్షం ప్రజలకు విన్నవించుకుంది. కేసీఆర్‌ను గద్దెదించడం మినహా ఓ లక్ష్యమంటూ లేని అసంఘటితంగా, విడివిడిగా ఉన్న విపక్షం టీఆర్‌ఎస్‌కు అధికారంలోకి రావడానికి అవకా శాలను కల్పించిదని నిపుణుల అభిప్రాయం.

image


అదే సమ యంలో అనేక ప్రైవేట్, రహస్య సర్వేలు టీఆర్‌ఎస్ వంద స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించినట్లు అధికార పక్షం ప్రచారం చేస్తోంది. అయితే ఉద్యమకాలంలో ఉన్న ప్రజాభిమానం నాలుగేళ్ళకు పైగా సాగిన పాలనా కాలంలో తగ్గినట్లు క్షేత్రస్థాయి అంచనాలు తెలియ జేస్తున్నాయి. భిన్న సైద్ధాంతిక భావజాలాలతో తె లంగాణలో అభూతస్థితిలో ఏర్పడిన మహాకూట మి టీఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా ఎదిరించి, ప్రజల అసంతృప్తిని ఓటు బ్యాంకులుగా మా ర్చుకోగల సత్తాలేదన్నది విదితమే. వరం గల్ పార్లమెంట్ ఉపఎన్నికలు, నారా య ణఖేడ్, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల స మయంలోనూ సర్వేల గురించి కేసీ ఆర్  చెప్పినట్లుగానే ఫలితాలు వచ్చాయి. ఆయన అంచనాలను బలపరుస్తూ ఆజ్‌తక్, టీవీ 5 తదితర సంస్థలు చేపట్టిన సర్వేలూ టీఆర్‌ఎస్ విజయా వకాశాలు వెల్లడి చేస్తున్నాయి. సర్వేలపై మాకు నమ్మకం లేదు, మేమే గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా, పలు ఎన్నికల్లో సర్వేల ఫలితాలు ఆ నేతల్లో గుబులు పుట్టిసు ్తన్న మాట వాస్తవమే. అయితే ప్రజల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై లోలోన నెలకొన్న అసంతృప్తి ఏ రూపంలో, ఏ స్థాయిలో, ఎంత తీవ్రతతో వ్యక్తమవుతుందోనని టీఆర్‌ఎస్ నేతలు మునుపటి ధీమా ప్రకటించలేకపోతున్నారు.
 
ఐదేళ్ళ పాలన తర్వాత సహజంగానే అధికార పక్షానికి ఓటింగ్ శాతం తగ్గడం ఖాయం. ఈ రకంగా ఉమ్మడి రాష్ట్రం లో అనేకసార్లు కాంగ్రెస్, టీడీపీలు రెండుసార్లు అధికారం లోకి వచ్చాయి. అయితే ఒకవేళ ఐదేళ్లు పాలించిన తర్వాత తిరిగి గెలిచినా ఓటింగ్ శాతం తగ్గింది. అయితే టీఆర్‌ఎస్ సీట్ల సంఖ్యనే కాదు ఓటింగ్ శాతాన్ని కూడా గణనీయంగా పెంచుకొనే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్ర చారం చేస్తున్నాయి. వివిధ సర్వేలు 43-48 శాతం వరకు టీఆర్‌ఎస్‌కు వస్తాయని ముందస్తు అంచనాలు వేశాయి. 2014 ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తెలంగాణలో 34.15 శాతం ఓట్లతో 63 సీట్లు లభించాయి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించి, 1957లో సాధారణ ఎన్ని కలు జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు 13 సార్లు శాసన సభకు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్క 1972లో మాత్ర మే అధికార పక్షం మొత్తం ఓట్లలో 50 శాతానికి పైగా సాధించింది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ 52.29 శాతం ఓట్లు సాధించింది. టీడీపీ ఆవిర్భావం జరిగిన తర్వాత 1983 ఎన్ని కల్లో ఆ పార్టీని గుర్తింపు పొందిన పార్టీగా పరిగణించలేదు. టీడీపీ తరపున గెలిచినవారిని ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే చూపారు. 83 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం టీడీపీని గుర్తింపు పొందని పార్టీ అని చూపుతూ ఒక్కరే గెలిచారని, మిగిలినవారంతా ఇండిపెండెంట్ అభ్యర్థు లని చూపారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ల ఓట్లు, టీడీపీ అభ్యర్థుల ఓట్లను కలిపే చూపడం వల్ల నాటి ఓటింగ్ శాతం అధికారికంగా గుర్తించలేం. అయితే 1994లో ఎన్టీఆర్ నాయ కత్వంలో అసెంబ్లీ చరిత్రలోనే తొలిసారిగా ప్రతిపక్షం హోదా కూడా లేనంత మెజారిటీని సాధించిన టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ 33.85 ఓట్ల శాతంతో కేవలం 26 సీట్లకే పరిమితమైంది. 

అధికార పార్టీపై ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తిని ఓట్లుగా సంఘటితం చేయగల సత్తా ప్రతిపక్షాలకు లేకపోవడం టీఆర్ ఎస్‌కు కలిసివచ్చింది. ఈసారి ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ అత్యధిక ఓట్లు, సీట్లతో చరిత్ర సృష్టించనుందని ఆ పార్టీ శ్రే ణులు ప్రచారం చేస్తున్నాయి. 2004లో 27 స్థానాలు, 2009 లో 10 స్థానాల్లో గెలిచిన టీఆర్‌ఎస్ 2014 వచ్చేసరికి 63 స్థానాల్లో విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన త ర్వాత ఉప ఎన్నికలన్నిటిలోనూ తిరుగులేని విజయం సాధిం చింది. ఉద్యమకాలంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్ని కల్లో అసలు పోటీచేయని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక 99 డివిజన్‌లలో విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలోనే ఇది ఘన విజయంగా నిలిచింది. నెలకు వెయ్యి రూపాయలు అందించే ఆసరా పథకం, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మత్స సంపద పెంపు చర్యలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాల అమలు అధికార పార్టీని ప్రజల్లో ఇనుమడింప చేశాయి. మేధావులను సైతం ఆకట్టుగలిగాయి. ఆరు దశాబ్దాలకు పైగా సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన నేపథ్యంలో వ్యవసారంగ అభి వృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకదృష్టి కేంద్రీకరించింది. కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ పథకాలను దేశంలో ఎక్కడలేని స్థాయిలో విప్లవాత్మక సంస్కరణలను చేపట్టింది. దాని మూలంగా రాష్ట్రంలోని 58 లక్షల రైతు కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధిచేకూరడమే కాకుండా, మొత్తం సమాజంలోని ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు దోహదం చేస్తుందని నిపుణుల అభిప్రాయం. వానకాలం, యాసంగి పంటలకు కలిపి ఎకరానికి ఎనిమిది వేలు రూపాయల వ్యవసాయ పెట్టు బడిని రైతులకు అందచేయడం అపూర్వమైన పథకం. రైతు లకే నేరుగా పెట్టుబడి సొమ్మును అందించడం ద్వారా సంక్షో భంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవ సాయానికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం ఆశించింది. 

టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరుసగా నాలుగు బడ్జెట్లలో సాగు నీటి ప్రాజెక్టులకు పెద్ద పీటవేసింది. పర్యవసానంగా భూము లు బీడుపడి ప్రజలు వలసపోత్ను మహబూబ్‌నగర్ జిల్లా కూడా పచ్చనిన పొలాలు అవతరించాయి. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి వాటికి రూ. 500 కోట్లు కేటాయిం చడం వ్యవసాయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు. సమితులు, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇ-నామ్ అమలులోకి రావడం, మార్కెట్ నియమాల సరళీ కరణ, ఫీజుల ఏకీకృతం, దళారుల ప్రమేయం రూపు మాసి పోవడంతో రైతులు నేరుగా ఉత్పత్తులను విక్రయించే సౌల భ్యం కలుగుతుంది. అయితే ఆ ప్రయత్నం పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. దళితులకు మూడెకరాలు, వ్యవసాయ పెట్టుబడి అందిస్తానని కేసీఆర్ చేసిన హామీ అమలుకాక పోవ డం ఆయా సెక్షన్ ప్రజలలో తీవ్ర అసంతృప్తి నుంచి టీఆర్ ఎస్ తప్పించుకోలేకపోయినా, ఆ పరిస్థితిని సంఘటితం చేయ గల సత్తా ప్రతిపక్షాలకు లేకపోవడంతో అధికార పక్షం మరో సారి గద్దెనెక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణుల అభిప్రాయం. కేంద్రంలో బీజేపీ అధికార పక్షంతో కొనసాగిన టీఆర్‌ఎస్‌కు మిత్రలాభం మాట ఎలా ఉన్నా, మిత్రనష్టం నుంచి తప్పించు కోలేమని భావించిన టీఆర్‌ఎస్ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సిద్ధపడి మోదీప్రభుత్వ లొసుగుల ను విమర్శిస్తూ దూరంగా జరిగింది. అదే సమయంలో నిజాం నవాబును లౌకిక ప్రభువుగా కీర్తిస్తూ ఎంఐఎం పార్టీతో మిత్ర త్వాన్ని కొనసాగించడంలో కేసీఆర్ అపర చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆంధ్ర ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చనే ముందుచూపుతో ఆయన ముస్లిం ప్రజానీకాన్ని అనేక సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లతో మచ్చిక చేసుకునేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలని స్తున్నాయనడంలో సందేహం లేదు. 

రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే సిట్టింగ్ స్థానాలతో పాటు పార్టీ ప్రభావిత స్థానాల్లో ఎవరెవరిని పోటీలో దించాలన్న దానిపై ఓ స్పష్టతతో ఉన్న బీజేపీ నేతలు మిగతా స్థానాలపైనా దృష్టి సారించారు. ఆశా వహుల బలాబలాలను అంచనా వేసి, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నవారినే పోటీలో నిలపాలని యోగిస్తున్నారు. అదే సమయంలో సామాజిక తెలంగాణ లక్ష్యంతో కోదండ రామ్ నాయకత్వలోని తెలంగాణ జన సమితి, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ పాలనలో ప్రజల్లో నెలకొన్న అసం తృప్తిని సంఘటితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ చివరలో తెలంగాణ శాసనసభ ఎన్ని కలు జరిగే అవకాశాలున్నాయనే ఊహాగానాలు నడుసు ్తన్నాయి. బీజేపీ మినహా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామ పక్షాలతో రూపుదిద్దుకోబోతున్న మహాకూటమి టీఆర్‌ఎస్‌కు ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా నిలువగలదో వేచిచూడాలి. దానికి తోడు బహుజన- లెఫ్ట్ ఫ్రంట్, గద్దర్ సారథ్యంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ పార్టీలు స్వతంత్రంగా పోటీచేస్తూ కేసీఆర్ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీ ఆర్‌ఎస్ మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు లోపాయికారీగా ఉపయోగ పడుతున్నాయనే అపవాదులను ఎదుర్కొంటున్నాయి. అనేక ప్రజా ఉద్యమాలతో కొలిమిలో పుటం పెట్టబడిన తెలంగాణ ఓటరు వివేకంతో ఎవరిని అధికారంలోకి తీసుకొస్తాడో వేచి చూడాలి!        

- వెల్దండి గిరిప్రసాద్
సామాజిక విశ్లేషకుడు

English Title
What is the dissatisfaction?
Related News