భారతి మిట్టల్ ఔదాత్య ఉపయోగమెంత?

Updated By ManamWed, 02/14/2018 - 23:37
ilayya

What is the use of Bharti Mittal?

ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, యావత్ దేశంలో గణనీ యంగా పెరిగిన ప్రైవేటు పెట్టుబడి ప్రజావ్యతిరేకత పై చర్చ మొదలైంది. ఒక కమ్యూనిటీలో పేరుకున్న సంపద ప్రజా భివృద్ధి కార్యక్రమాలకు ఏనాడు ఖర్చు చేయలేదని, అవి ఆధ్యాత్మికరంగాల్లో పెట్టే ఖర్చు శ్రమజీవుల అభివృద్ధికి దోహదపడేది కాదని పత్రికలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. ‘ప్రజాసేవ’ అనే దృక్పథం అట్టడుగు వర్గాల-ముఖ్యంగా ఆదివాసి, దళిత, ఉత్పత్తి కులాల అభివృద్ధికి దోహదపడాలనే చర్చ బలంగానే సాగుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక వ్యాపార వర్గాలు ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రైవేటురంగంలోకి మార్చుకున్నాయని చాలామంది ఆర్థికవేత్తలు చెప్పే స్థితి వచ్చింది. కానీ ఆ పార్టీ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల ఊసు ఎత్తకుండా దళిత బహుజ సమాజాన్ని దగా చేస్తోందని బలమైన వాదన ముందుకొచ్చింది. 

ఈ తరుణంలో దేశంలో ఇంటింటా తన సెల్‌ఫోన్ వ్యాపారం చేస్తున్న ఎయిర్‌టెల్ అధిపతి భారతీ మిట్టల్ యాజమాన్యం ఏడువేల కోట్లతో ప్రజా ప్రయోజన కార్యక్రమాలు మొదలుపెడుతున్నామని ప్రకటించింది. మంచిదే, ఆహ్వానించదగ్గదే. ప్రధాని నరేంద్ర మోదీకి అన్నివిధాల అండగా ఉండి ఎన్నికల్లో గెలిపించి, ఈ ప్రభుత్వంలో బాగా లాభపడ్డ అదాని గ్రూపు ఎన్నికల టైమ్‌లోనే పైసలతో ప్రజల్ని కొంటే సరిపోతుందనే ధీమాగా ఉంది. 2014 ప్రక్రియే 2019లో జరిగితే దేశం ఏమైతుందునే భయం ప్రజల్లో మొదలైంది కూడా నిజమే. అయితే భారతి మిట్టల్ ఈ ఏడువేల కోట్లను ఎలా ఖర్చు పెట్టదల్చుకున్నారనేది చాలా ముఖ్యం. ఆ కంపెనీ అధిపతి నవంబర్ 23న ప్రకటించిన దాని ప్రకారం వారు ‘సత్య భారతి’ అనే పేరుతో ఒక యూనివర్సిటీ ప్రారంభిస్తారు. ఆ యూనివర్సిటీ ఎమ్‌ఐటీ, బోస్టన్, బర్కలీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల వంటి పాత్ర నిర్వహిస్తుందట. ఇందులో వెనుకబడిన తరగతుల విద్యార్థులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, శూద్ర అగ్ర కుల బీద పిల్లలు చదవాలన్నా ఎల్‌కేజీ నుంచి ఇంగ్లీషు మీడియంలో 12వ తరగతి వరకు చదవకుండా వాళ్ళు ఆ యూనివర్సిటీలో ఎలా చదువుతారు? కొన్ని మోనోపలి కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బుతో చాలా ఖరీదైన ఆంగ్ల మీడియం స్కూళ్లు ఈ పిల్లల కోసం నడుపు తున్నారు. అందులో దళిత బహుజన, ఆదివాసి పిల్లలకు అడుగుపెట్టే అవకాశమే లేదు.

  ''దేశంలో అత్యున్నత ధనవంతమైన అంబానీలు ఇప్పటికీ ప్రజాదరణ ఫౌండేషన్లు ఏమీ ప్రారంభించలేదు. ప్రైవేట్ సెక్టారులో రిజర్వేషను విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి 2014 ఎన్నికల్లో పెట్టబడి పెట్టి అధికారంలోకి తెచ్చిన ఆదాని గ్రూపు ఒక్క పైసా కూడా బీద ప్రజలకు, దళిత బహుజనులకు దక్కనిచ్చే ఫౌండేషన్ ఏదీ పెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా లాభపడ్డ కంపెనీ ఇదే''

ఇప్పుడు భారతీ మిట్టల్ పెట్టబోయే ‘సత్యభా రతి’ యూనివర్సిటీలో వాళ్ల టాప్ స్కూళ్ళలోనో కేథ లిక్ క్రిస్టియన్ టాప్ స్కూ ళ్లలోనో చదువుకున్న వా రు మాత్రమే చదవగ లరు. ప్రాంతీయ భాషల్లో చదివిన వారికి అడ్మిషన్లు ఇచ్చినా వాళ్ళు డ్రాపవుట్ కావాలి లేదా ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పటికే అజిమ్ ప్రేమ్‌జీ ఒకటి నడుపుతున్నాడు. ఈ యూనివర్సి టీలన్నీ భారతదేశంలోని అమెరికన్ ఐలాండ్స్! ఈ విషయం గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీషు విద్యను వ్యతిరేకించే బీజేపీ వాళ్లెవరు వాళ్ళు పూజిస్తామని చెప్పుకునే సంస్కృతంలో వాళ్ల పిల్లల్ని చదివించడం లేదు. లేదా హిందీ, తదితర ప్రాంతీయ భాషల్లో చదివించడం లేదు. ఇదొక ఆధునిక కుట్ర. ఇందులో వాళ్ల చట్రంలోని దళిత బహుజనులు కూడ బలౌతారు. కానీ అది వారు నమ్మే కర్మ సిద్ధాంతంలో భాగం.

         2006-07లలో ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లను మొత్తం ఇండస్ట్రీ వ్యతిరేకించినపుడు వీరప్పమొయిలీ కమిటీకి హాజరైన మేధావులందరం కనీసం గ్రామీణ ప్రాంతంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు నడిపే ఉదారత్వం చూపండి అని అడిగాం. ఇన్ఫోసిస్ నారా యణమూర్తి వంటి పెట్టుబడిదారీ మేధావులు అది కుదరదన్నారు. యూనివర్సిటీల్లో ఫిలాంత్రఫీ డబ్బు పెట్టడమంటే అణగదొక్కబడ్డ కుల/వర్గాల దృష్టితో చూసినపుడు చెట్టుకొమ్మల్లో ఖర్చుపెట్టడం వంటిది. ముందు దాని వేర్లను బలపర్చాలి. ఆ పని ఇంగ్లీషు మీడియం స్కూళ్ల ద్వారా మాత్రమే జరుగుతుంది. అది చెయ్యడానికి పెట్టుబడిదారులు సిద్ధంగా లేరు. పోనీ ప్రభుత్వాలైనా ‘కామన్‌స్కూల్’ వ్యవస్థ వైపు ఆలోచిస్తున్నాయా అంటే అదీ లేదు. ఈ పెట్టుబడిదా రీ వ్యవస్థ రెండు భిన్న విద్యావిధానాలు మద్దతు దారులే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ భాషల్లో నడవా లని పాలకులను ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఆంగ్లేయ మీడియాను వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో ఇంగ్లీషు మీడియం విద్య గురించి మాట్లాడేవారిని క్రిష్టియన్ ఏజెంట్లు అని ప్రచారం చేస్తున్నారు. తమ పిల్లలు పట్టణాల్లో ఇంగ్లీషు మీడి యం చదువుకుంటే మాత్రం దేశభక్తులంటున్నారు. ఈ మోసపూరిత ప్రచారంలో స్వార్థపరులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా చేరుతున్నారు.

           ఈ ద్వంద్వ విద్యా సాలెగూడు నుంచి దేశాన్ని బయట పడేయడం చాలా పెద్దసమస్యగా మారింది. ఇందులో కొన్ని శక్తులు పెట్టుబడిదారుల మీద అధార పడి ద్వంద్వ విద్యావిధానాన్ని కాపాడే శక్తులను తమ భుజాల మీద మోస్తున్నారు. రాష్ట్రస్థాయి ప్రభుత్వ విద్యా విధానాన్నంత ఇంగ్లీషు మీడియంలోకి మార్చ కుండా పెట్టుబడిదారులు పెట్టే ప్రైవేటు యూనివర్సిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీద ప్రజానీకానికి ఉరితాళ్లుగా మారుతాయి. అమెరికాలో నల్లజాతి వాళ్లు ప్రైవేటు యూనివర్సిటీలో నెగ్గుకురావడానికి ఆ దేశంలోని ఏక భాష కామన్ ప్రభుత్వ స్కూళ్లు కారణం. బ్రిటన్‌లో గానీ, అమెరికాలో గానీ, ఆస్ట్రేలియాలో గానీ, కెనడాలో గానీ అన్ని స్కూళ్ళు ఒకే భాషలో, ఒకే స్టాండర్డ్స్‌తో నడుస్తాయి. ధనవంతుల పిల్లలు, బీదల పిల్లలు, తెల్లజాతివాళ్లు, నల్లజాతివాళ్లు అన్నిస్థాయిల్లో కామన్ స్కూల్ విద్యావిధానం వల్ల సమానంగా పోటీపడే వ్యవస్థ్థ ఏర్పడింది.

             భారతీ మిట్టల్ ఇదే ప్రకటనలో మన దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ ఒక దశకు చేరుకుందని చెప్పాడు. కంపెనీలు బీదల కోసం ఖర్చు చెయ్యాల్సిన దశ వచ్చిందని ఒప్పుకున్నాడు. తమ ఫౌండేషన్ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరహాలో పనిచేస్తుందని చెబుతున్నారు. మంచిదే. కానీ అమెరికన్ ఫౌండేషన్‌లు ఎక్కువ ప్రపంచంలోని అతి బీదప్రజల కోసం విద్య, వైద్య రంగాల్లో పనిచేస్తున్నాయి. నాదృష్టిలో వైద్య రంగం కంటే పాఠశాల విద్యారంగం చాలా ముఖ్యమైంది. అందులో భారతదేశం వంటి దేశం లో ఏక భాష విద్యారంగాన్ని బాగా అభివృద్ధి చేయాలి. అందుకు అనుకూలమైంది ఇంగ్లీషు భాష మాత్ర మే. గ్రామీణ వ్యవస్థను మొత్తంగా ఏక భాష అర్థం చేసుకొని, రాయగలిగే వ్యవస్థగా మార్చాలి. ఆ పని కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయలేవు. ప్రైవేటు పెట్టుబడి, మతసంస్థలు ముందుకు రావాలి. మత సంస్థలు, ప్రైవేటు పెట్టుబడిదారులు మానవతా విలువల్ని అవర్చుకొని పాఠశాల విద్యారంగంలో ఖర్చుపెట్టకుండా కులవ్యవస్థలోని వ్యత్యాసాలు పోవు.  శ్రమ గౌరవ పాఠాలు చెబుతూ స్కూలు విద్యా రంగాన్ని సంపూర్ణ సమాన త్వ విలువల్లోకి మార్చాలి.

              మన దేశంలో పట్టణ వ్యవస్థకూ గ్రామీణ వ్యవ స్థకూ మధ్య జీవన ప్రమాణాల్లో తేడా ఉండడం వల్ల కొద్దిపాటి సంపద ఒనగూడిన కుటుంబాలు గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తున్నాయి. ఈ మైగ్రేషన్‌లో ఇం గ్లీషు స్కూలు విద్య కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ మై గ్రేషన్‌ను అలానే పెరగనిస్తే వ్యవసాయ రంగం కుప్ప కూలుతుంది. బీజేపీ వంటి రైట్ వింగ్ పార్టీ చుట్టూ పనిచేసేవారికి ఈ అంశాలను చర్చించాలని గానీ, సిద్ధాంతీకరించాలనిగానీ లేదు. మిగతా పార్టీలకు ఓటు సమీకరణతో బతకాలని చూడడంవల్ల వ్యవసాయ వ్యవస్థను కాపాడాలనే ఆలోచనలేదు. పెట్టుబడిదారీ విలువల్ని గానీ, మతవిలువల్నిగానీ బీద ప్రజల్ని గానీ, మానవ సమానత్వాన్ని గాని గౌరవించేవిగా రూపొందించకుండా దేశం పూర్తి ఆధునిక దేశంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. దేశంలో అత్యున్నత ధనవంతమైన అంబానీలు ఇప్పటికీ ప్రజాదరణ ఫౌండేషన్లు ఏమీ ప్రారంభించ లేదు. ప్రైవేట్ సెక్టారులో రిజర్వేషను విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి 2014 ఎన్నికల్లో పెట్టబడి పెట్టి అధికారంలోకి తెచ్చిన ఆదాని గ్రూపు ఒక్క పైసా కూడా బీద ప్రజలకు, దళిత బహుజను లకు దక్కనిచ్చే ఫౌండేషన్ ఏదీ పెట్టలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా లాభపడ్డ కంపెనీ ఇదే. ఈ పెట్టుబడిదార్లను నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ వనరులతో పెద్ద ధనవంతుడైన అంబానీ ఆ రాష్ట్రానికి ఏమీ చెయ్యడం లేదు. ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీయాల్సిన అవసరముంది. ఈ పోరాటాన్ని ప్రైవేటు రంగం రిజర్వేషన్ పోరాటంతో ముడేయా ల్సిన అవసరముంది. 2019 ఎన్నికల నాటికి ఈ పోరాటాల్ని ఉధృతం చేయాలి. బీజేపీ ఎవరి పక్షం ఉంటుందో అప్పుడే తేలుతుంది. 
- కంచ ఐలయ్య షెఫర్డ్ 
97044 44692

English Title
What is the use of Bharti Mittal?
Related News