'దానం నాగేందర్ నన్ను కలిస్తే తప్పేంటి?'

Updated By ManamMon, 09/10/2018 - 18:38
Danam Nagender, Uttam Kumar reddy, Gulam Nabi Azad, Congress party
  • టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన

Danam Nagender, Uttam Kumar reddy, Gulam Nabi Azad, Congress partyహైదరాబాద్‌: త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుపుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేత దానం నాగేందర్‌ తనను కలిశారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దానం తనను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ నెల 12న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉందని చెప్పారు.

రేపటి (మంగళవారం) నుంచి 18 వరకు కాంగ్రెస్‌.. జెండా పండుగ నిర్వహిస్తోందని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా కలిసి తమ ఇళ్లు, వాహనాలపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కోరారు. 12న నిర్వహించే మీడియా సమావేశంలో ఆజాద్‌.. రాఫెల్‌ కుంభకోణంపై మాట్లాడతారని అన్నారు. అనంతరం సంగారెడ్డిలో మైనార్టీల సభలో పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు. కాగా, ఓ హోటల్‌లో ఉత్తమ్‌ను కలిశారంటూ వస్తోన్న ప్రచారాన్ని దానం నాగేందర్‌ ఖండించిన సంగతి తెలిసిందే.  

English Title
What is wrong if Danam Nagender meet me, says Uttam Kumar reddy
Related News