వాట్సాప్ గ్రూపు కాలింగ్ ఫీచర్ రెడీ..

Updated By ManamTue, 07/31/2018 - 18:25
WhatsApp, Group Video, Voice Calling Feature, Android, iOS Users
  • వాట్సాప్ గ్రూపులో వీడియో-ఆడియో కాలింగ్‌ ఫీచర్

  • ఐఓఎస్, ఆండ్రియాడ్ ఫోన్లలో వేగంగా పనిచేసే కొత్త ఫీచర్

  • గ్రూపు కాలింగ్‌లో ఒకేసారి నలుగురు గ్రూపు సభ్యులకు పరిమితి

WhatsApp, Group Video, Voice Calling Feature, Android, iOS Usersప్రముఖ మెసేంజర్ దిగ్గజం వాట్సాప్ ప్రవేశపెట్టిన గ్రూపు (వాయిస్ & వీడియో) కాలింగ్ ఫీచర్ ఎట్టకేలకు లైవ్‌లోకి వచ్చేసింది. గత ఏడాది అక్టోబర్ నెలలో తొలిసారి ఈ గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ సంస్థ యాప్‌.. ఈ ఏడాది మేలో జరిగిన వార్షిక ఎఫ్8 డెవలపర్ కాన్ఫిరేషన్‌లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వాట్సాప్ గ్రూపు కాలింగ్ ఫీచర్‌ ప్రపంచంలోని అన్ని ఆండ్రియాడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యుల్లో నలుగురు మాత్రమే ఒకేసారి గ్రూపు కాల్ మాట్లాడే అవకాశం ఉంది. రోజుకు 2 బిలియన్ల నిమిషాల పాటు వినియోగదారులు వాట్సాప్‌తో సమయాన్ని గడుపుతున్నారని, గ్రూపు వీడియో కాల్స్ ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని వాట్సాప్ దిగ్గజం పేర్కొంది. 2016 నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ను అనుమతిస్తోంది. కానీ, ఇప్పటివరకూ ఆండ్రియాడ్, ఐఓఎస్ ఫోన్‌లో పనిచేసే గ్రూపు వీడియో కాల్‌లో ఇద్దరు సభ్యులకు మాత్రమే పరిమితి విధించగా అదికాస్తా నలుగురు సభ్యుల వరకు పరిమితి పెంచుతున్నట్టు వాట్సాప్ వెల్లడించింది. ఈ సరికొత్త వీడియో కాలింగ్ ఫీచర్ నెమ్మదిగా పనిచేసే నెట్‌వర్క్‌లపై కూడా వేగంగా పనిచేసేలా రూపొందించినట్టు తెలిపింది. అంతేకాక, ఆడియో, వీడియో కాలింగ్‌ను సెక్యూరిటీ పరంగా చాటింగ్ తరహాలో ఎన్డ్ టూ ఎన్డ్ ఎన్‌క్రిప్టిట్‌గా చేసినట్టు వెల్లడించింది. 

గ్రూపు వీడియో-ఆడియో కాల్ ఇలా చేయొచ్చు.. 
వాట్సాప్ గ్రూపు వీడియో-ఆడియో కాల్ చేసేముందు మీ ఫోన్ కాంటాక్ట్‌లోని ఓ నెంబర్‌కు వీడియో (ఆడియో) కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓ బటన్ కనిపిస్తుంది. మీ ఫోన్ స్ర్కీన్‌పై టాప్ రైట్ కార్నర్‌లో మరో గ్రూపు సభ్యున్ని జాయిన్ చేసుకొని కాల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి కాల్ కనెక్ట్ అయితే చాలు.. టాప్ రైట్ కార్నర్‌లో మరో సభ్యునికి కాల్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మరో ఇద్దరి సభ్యులను కాల్‌కు కనెక్ట్ చేయొచ్చు. తద్వారా నలుగురు గ్రూపు సభ్యులు ఒకేసారి మాట్లాడుకోవచ్చు. ఇక్కడో గమనిక.. ఈ కొత్త ఫీచర్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి వాట్సాప్‌ కొత్త వెర్షన్ ఆప్‌డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 

English Title
WhatsApp Group Video, Voice Calling Feature Rolled Out for Android, iOS Users
Related News