మహిళా బిల్లుకు మోక్షమెప్పుడు?

Updated By ManamWed, 04/25/2018 - 01:13
image

imageప్రపంచ స్థాయిలో అత్యంత శక్తిమంతులుగా పేరొం దిన ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రపంచం లోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇలా ఎన్నో ఘన తలు మన సొంతం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి, నేటివరకు ఎన్నో సవాళ్ళను అధిగమించటం తో పాటు గణనీయమైన ప్రగతిని  సాధించాం. దేశ రాజకీయాలలో కాని, ప్రజాస్వామ్యంలో అతి ముఖ్య మైన చట్టసభలలో అంటే అటు పార్లమెంటులో కాని, ఇటు రాష్ట్ర అసెంబ్లీలలో కాని మహిళల ప్రాతినిధ్యం ఆందోళనకర స్థాయిలో ఉందన్నది వాస్తవం. ఈ సమ స్యను సరిదిద్దే దిశగా 1996లో మొదలైన ప్రయ త్నాలు, కారణాలు ఏమైనా నేటికీ సఫలం కాలేదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో మహి ళలకు 1/3 శాతం (మొత్తం సభ్యులలో 33%) సీట్లు మహి ళలకు రిజర్వ్ చేయటానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవ రణ బిల్లుకు తుది మెరుగులు దిద్దుతుందని,  మెజా రిటీ ఉన్న ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదింపచేయవచ్చునన్న ఊహాగా నాలు ఉన్నా నేటికీ అవి కార్యరూపం దాల్చ లేదు.

60 మంది సభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీలో 2018 ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్లలో కూడా ఒక్క టంటే ఒక్క అసెంబ్లీ సీటుకు కూడా మహిళా ప్రాతి నిధ్యం లేదు. ఇప్పుడే కాదు 1963లో నాగాలాండ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క మ హిళ కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టే అ ర్హత సాధించలేదు. నాగాలాండ్‌లోని మునిసిపాలిటీ లలో, లోకల్ బాడీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించటానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిన ప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అ ల్లర్లు జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటాన్ని బట్టి మనం ఇంకా పురుషాధిక్య సమాజం నుంచి పూర్తిగా విముక్తులం కాలేదు అని అర్ధమవుతుంది. అంతగా అభివృద్ధి చెందని ఈశాన్య రాష్ట్రాల సంగతి సరే, అభి వృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే  224 అసెంబ్లీ సీట్లు ఉన్న కర్ణాటకలో 2013లో ఎన్ని కైన మహిళా ఎమ్మెల్యేలు కేవలం ఆరుగురు మాత్రమే. చట్టసభలలో మహిళల ప్రస్తుత స్థానాన్ని, మహిళా ప్రా తినిధ్యం పెరగాల్సిన ఆవశ్యకతనూ ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మన మొట్ట మొదటి లోక్‌సభ (1952-57)లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 24 మాత్రమే. 63 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడిచిన తర్వాత, ప్రస్తుత 16వ లోక్‌సభ (2014-19)లో ఆ సంఖ్య నామమా త్రంగా పెరిగి 64కి చేరింది. అంటే 4.80 శాతం నుం చి దశాబ్దాల తరువాత కేవలం 11.74 శాతానికి చేరింది. ఒకప్పటికన్నా నేడు పరిస్థితి కొంత మెరుగు పడి మహిళల ప్రాతినిధ్యం కొంచెంకొంచెంగా పెరుగు తున్నా, ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందు తున్న దేశాలతో పోలిస్తే మనం ఎంతో వెనకబడి ఉన్నామని అర్ధమవుతుంది. భారతీయ మహిళ సగటు అక్షరాస్యత 1951లో కేవలం 8.86 శాతం మాత్రమే ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం అది 65.46 శాతానికి, 2015లో నిర్వహించిన సర్వే ప్రకారం 72.1 శాతానికి పెరిగింది. మహిళ అక్షరాస్యత వృద్ధి రేటు గణనీయంగా పెరిగినా, చట్టసభలలో మహిళా ప్రాతి నిధ్యం చాలా నిరాశా జనకంగా ఉండటం గమనార్హం.
 
లోక్‌సభ (లేక) ఎగువ సభలలో ప్రపంచ మహి ళల ప్రాతినిధ్య సగటు రేటు 23.5 శాతంగా ఉండగా, ఆసియా సగటు 19.7 శాతంగా ఉందని ఇంటర్ పార్ల మెంటరీ యూనియన్ అనే అంతర్జాతీయ సంస్థ చే పట్టిన సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలైన చైనా (24.2), లావోస్ (27.5), ఫిలిప్పైన్స్ (29.5), కంబోడియా (20.3) దేశాలలో మహిళా ప్రాతినిధ్య రేటు కన్నా మనం వెనకబడే ఉన్నాం. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ (20.6), బంగ్లాదేశ్ (20.3), నేపాల్ (29.6) కన్నా కూడా వెనకబడే ఉన్నాం.    

భారత రాజకీయాలు, రాజకీయ విధానాలు మా రాలంటే మహిళకు నిర్ణయాధికారం, ప్రధాన నిర్ణయా లలో తగు భాగస్వామ్యం ఇవ్వాల్సి ఉంది. దేశ వ్యా ప్తంగా సర్వే నిర్వహించిన ఒక సంస్థ, మహిళా నా యకత్వం ఉన్న పంచాయితీలలో అవినీతి చాలావరకు తగ్గిందని, కనీస అవసరాల విషయంలో మిగతా పంచాయితీలకన్నా మెరుగ్గా ఉందని వెల్లడించింది. 

మన రాజ్యాంగంలోని అధికరణాలు స్త్రీ, పురుషు ల మధ్య అసమానతలు తొలగించి, ఇద్దరికీ సమాన హక్కులు ప్రసాదించినా, ఇప్పటికీ మన పార్లమెంటు లో, రాష్ట్ర అసెంబ్లీలలో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న  వ్యత్యాసం,  లింగ వివక్ష ఇంకా తొలగలేదు అన్న వి షయం తెలియచేస్తోంది. మనలాంటి అభివృద్ధి చెందు తున్న దేశాలకు మహిళా రాజకీయ భాగస్వామ్యం చాలా కీలకమైనది. నాయకత్వ స్థానంలో మహిళ ఉం డటం సానుకూల ప్రభావాన్ని చూపుతుందనే విష యాన్ని బాగా గ్రహించిన చాలా ప్రపంచ దేశాలు ఇప్పటికే వారి చట్టసభలలో మహిళలకు తగిన స్థానం కల్పించాయి. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వే షన్  కల్పించటం వలన మహిళల ప్రాతినిధ్యం పెరిగి, తద్వారా మన దేశ జనాభాలో 48.5 శాతంగా ఉన్న  మహిళలు తమ సమస్యలు ఎలుగెత్తి చాటి చె ప్పి పరిష్కరించుకోవటానికి, హక్కులు సాధించుకోవ టానికి ఎంతో ఉపయోగపడుతుంది.  

మన దేశ చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కేటాయించాలన్న ప్రతిపాదనకు తరాలు గడుస్తున్నా మోక్షం మాత్రం లభించటం లేదు. పురుషాధిక్య స మాజంలో అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నా, 1996లో మొట్టమొదటిసారి రాజ్యాంగ సవరణ బిల్లు కు విజయం నేటికీ  వరించలేదు. ఈ మహిళా రిజ ర్వేషన్ 15 సంవత్సరాలకు మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించారు. 1996లో దేవెగౌడ నాయకత్వంలోని అప్పటి కేంద్ర ప్రభుత్వ హయాంలో మన చట్టసభల్లోని మొత్తం సభ్యులలో 1/3 శాతం మహిళలకు చెందేలా రిజర్వేషన్ కల్పించటానికి ఉద్దేశించే రాజ్యాంగ సవరణ బిల్లుకు తొలి అడుగుపడినా, అప్పుడు మొదలు ఇప్పటి దాకా అంటే దాదాపు 22 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఈ బిల్లుకు మోక్షం లభించలేదు. యు.పి.ఎ. ప్రభుత్వ హయాంలో 2010లో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదించబడటంలో సఫలీకృతమైనా, లోక్‌సభలో ప్రవేశపెట్టటంలో మాత్రం విఫలమైంది

ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన దేశంలోని పంచాయితీల్లో, మునిసిపాలిటీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిం చిన 73వ, 74వ రాజ్యాంగ సవరణ బిల్లులు 1992 లో,  మన తెలుగు బిడ్డ స్వర్గీయ పి.వి.నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమోదించబడ టం. రాజకీయాలలో మహిళలు ప్రాతినిధ్యం వహించే విషయంలో ఈ రెండు రాజ్యాంగ సవరణలు గణనీ యమైన మార్పు తీసుకువచ్చిన  విషయం నిర్వివాదాంశం. వివిధ సందర్భాలలో వివిధ పార్టీలు చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించటానికి ఉద్దేశించిన బిల్లు వ్యతిరేకించటానికి చెప్పిన కారణాలలో ముఖ్యమైనవి మూడు. అందులో మొదటిది ప్ర స్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపిలు, సమర్థవం తమైన, దీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ పార్లమెంటేరియన్లలో కొంతమంది ఈ బిల్లు అమలు చేయటం వలన తమ స్థానం కోల్పోతారు అన్న వాద న. రెండవది ఈ బిల్లు కేవలం ధనిక వర్గానికి చెందిన చదువుకున్న వారికే ఉపయోగమనే ఉద్దేశంతో కొంత మంది ఈ బిల్లును వ్యతిరేకిస్తుండగా, మూడవది సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపిలు తమ స్థానంలో తమ కుటుంబ సభ్యులను పోటీకి నిలబెట్టే అవకాశం ఉండ టం వలన ప్రస్తుత రాజకీయ నాయకుల దగ్గర బం ధువులకు మాత్రమే ఈ బిల్లు ఉపయోగమనే అభిప్రాయం.  

మొత్తం సభ్యులలో 1/3 శాతం మహిళలకు కేటాయించటానికి ఉద్దేశించిన ఈ 33% రిజర్వేషన్ బిల్లులో అంతర్గతంగా మైనారిటీలకు, వెనకబడిన కు లాల మహిళలకు  రిజర్వేషన్ ఉండాలని అప్పట్లో స మాజ్‌వాదీ, రాష్ట్రీయ జనతా దళ్ లాంటి పార్టీలు కోరాయి. ఇదిలా ఉంటే, నేటి సమాజంలో పురుషు లతో సమానంగా మహిళలకూ అవకాశాలు ఉన్నాయ ని అందువల్ల ప్రత్యేకంగా మహిళలకు రిజర్వేషన్ కేటాయించవలసిన అవసరం లేదని వాదిస్తున్న వారూ ఉన్నారు.

కాంగ్రెస్, బిజెపిలు రెండూ గతంలో ఈ బిల్లుకు అనుకూలమంటున్నా, కారణాలు ఏవైనా మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం విజయం సాధించలేకపో యింది. లోక్‌సభలో తమకున్న బలమైన మెజారిటీని ఉపయోగించుకొని మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించటానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవ రణ బిల్లు ఆమోదింపబడేలా చూడాలని గత సెప్టెం బరు 2017లో ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యా గాంధీ ప్రధానిని కోరారు.  అధిక మెజారిటీతో గత నాలుగేళ్ళుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ హయాంలో ఈ మహిళా బిల్లు ఆమోదింపబడే అవకా శాలున్నాయని, ప్రభుత్వం బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుందని, దానిని త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని కొన్ని జాతీయ మీ డియాలలో కొద్దినెలల క్రితం ఊహాగానాలు వెలువ డినా, ఇప్పటిదాకా అటువంటి దేమీ జరగలేదు. 

మనదేశం శక్తిమంతం అవ్వాలంటే, ముందుగా మహిళలు మన చట్టసభలలో తగినంతగా భాగస్వా ములు అవ్వవలసిన అవసరం ఉంది. భారతీయ మ హిళలకు లబ్ధిచేకూర్చే ఈ బిల్లుకు ఇకనైనా మోక్షం లభించి దేశచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు త్వరలోనే రావాలని ఆశిద్దాం.

రాజశేఖర్ ఎల్, 
ఫ్రీలాన్స్ జర్నలిస్టు

English Title
When is the woman's bill
Related News