హైపవర్ వేతనాలెక్కడ?

Updated By ManamMon, 04/16/2018 - 01:33
image
  • ఒప్పందానికి ఐదేళ్లు.. కోల్ ఇండియాలో అమలు..

  • ఆ ఊసే ఎత్తని సింగరేణి యాజమాన్యం

  • మజ్జిగ పంపిణీకి నోచుకోలేదు

  • కాంట్రాక్ట్ కార్మికుల ఆవేదన

imageహైదరాబాద్: బొగ్గు ఉత్పత్తిలో నిర్దేశిత లక్ష్యాల సాధనకు సింగరేణి పెట్టింది పేరు.. మిగతా ప్రభుత్వ సంస్థలకు ఈ విషయంలో సింగరేణి ఆదర్శంగా నిలుస్తోంది. సంస్థలో రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులూ చెమటో డ్చడం ద్వారానే ఇది సాధ్యమని ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తారు. అయితే, కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో సింగరేణి నిర్లక్ష్య ధోరణి వహిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైపవర్ వేతన ఒప్పందమే ఇందుకు తార్కాణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోల్ ఇండియాలో ఈ ఒప్పందం అమలవుతున్నా.. సింగరేణిలో ఆ ఊసే లేకపోవడంపై కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీలో హైపవర్ కమిటీ వేతనాలను అమలు చేయడంలో యూజవూన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒప్పందం జరిగి ఐదేండ్లైనా హైపవర్ వేతనాల అమలు దిశగా చర్యలు తీసుకోకుండా, అసలు ఆ విషయంతో తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనాల అమలులో కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. 

25,367 మంది కాంట్రాక్ట్ కార్మికులు..
నిర్దేశిత లక్ష్యాలను సాధించడంలో పర్మినెంట్ కార్మికులతో పాటుగా కాంట్రాక్ట్ కార్మికులూ కీలక పాత్ర పోషిస్తున్నారు. సింగరేణిimage వ్యాప్తంగా దాదాపుగా24,747 వుంది కాంట్రాక్ట్ కార్మికులు కంపెనీలో పనిచేస్తున్నారు. కార్పొరేట్ ఏరియూలో 905 వుంది, కొత్తగూడెం ఏరియూలో 2,379, మణుగూరులో 1,604, ఇల్లెందులో 740, భూపాలపల్లిలో 1,109, రామగుండం ఆర్జీ 1,2,3లలో 1,583, 875, 1,759మంది, శ్రీరాంపూర్‌లో 1,486, మందమర్రిలో 1,126, బెల్లంపల్లిలో 2,151, అడ్రియూల లాంగ్‌వాల్ వద్ద 560, జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టులో 2,470 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా కోల్ ట్రాన్స్‌పోర్ట్, లోడింగ్, అన్‌లోడింగ్, సులభ్ కాంప్లెక్స్ లలో మరో 5,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. నర్సరీల్లో 270 మంది, కన్వేయన్స్ డ్రైవర్లు 350 మంది ఉన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు అనే వూటే ఉండదని అందరినీ రెగ్యులర్ చేస్తామని గత ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలోనూ క్రమబద్ధీకరణపై సీఎం హామీ ఇచ్చారు. దీంతో కనీస వేతనాలు లేకుండా ఏళ్లతరబడి వెట్టిచాకిరి చేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. కాగాసీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా.. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కోల్ ఇండియాలో చేసుకున్న ఒప్పందం ప్రకారం హైపవర్ కమిటీ వేతనాలు అందేలా అయినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కార్మికులు కోరుతున్నారు. సంస్థలో పర్మినెంట్ కార్మికులతో దాదాపు సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నా వారి సంక్షేమం విషయంలో యాజమాన్యం పట్టించుకోని దుస్థితి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే వీరికి కనీసం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయని పరిస్థితి నెలకొంది. కాంట్రాక్టర్లు పనిచేయించుకోవటం తప్ప తమ సంక్షేమాన్ని పట్టించుకోవటంలేదని పలువురు కార్మికులు వాపోతున్నారు.

ఏమిటీ హైపవర్ వేతన ఒప్పందం?
 ప్రకృతికి  విరుద్ధంగా భూగర్భంలో, సంక్లిష్టమైన వాతావరణంలో పనిచేస్తున్న కార్మికులకు వారి శ్రమకు తగ్గ వేతనాలు చెల్లించాలన్నదే ఈ ఒప్పందం.. హైపవర్ వేతన కమిటీ ఈమేరకు యాజమాన్యా లకు సూచనలు చేసింది. దీనికి అనుగుణంగా 2012 సెప్టెంబరు 9న ఒప్పందం జరిగింది. తొమ్మిదో వేతన సవూవేశంలో కుదిరిన ఒప్పందం మేరకు కోలిండియూ పరిధిలోని కోల్‌కారిడార్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. కోలిండియూ పరిధిలోని బొగ్గు పరిశ్రమలు ఆ మేరకు చెల్లిస్తున్నారు. కానీ సింగరేణి మాత్రం తమకు ఆమేరకు వేతనాలు చెల్లించటంలేదని కాంట్రాక్ట్ కార్మికులు వాపోతున్నారు.

సుప్రీం కోర్టు తీర్పు అమలేదీ?
కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ సింగరేణిలో కొన్ని విభాగాల్లో అమలు చేయుడంలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా నర్సరీ, సులభ్ కాంప్లెక్స్, కన్వేయున్స్, కోల్ ట్రాన్స్‌పోర్ట్ విభాగాల్లో కనీస వేతనం అమలు చేయుడంలేదని చెబుతున్నారు. అన్ని విభాగాల్లోనూ సుప్రీం ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని  నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

English Title
Where are the hyperpower wages?
Related News