ఏజెన్సీలో వైద్యులెక్కడ..?

Updated By ManamMon, 09/24/2018 - 01:06
mathanam

image21వ శతాబ్దపు చివరి దశకంలో కూడా ఎవరూ చావనవసరం లేని పద్ధతిలో ప్రజలు చనిపోతున్నారు. శుభ్రైమెన మంచి నీళ్ళు లేక, శుభ్రైమెన పరిసరాలు లేక, పారిశుద్ధ్యానికి అవసరైమెన డీడీటీ వంటి క్రిమిసంహారక మందులు లేక, వున్న వాటిని వుపయోగించే శ్రద్ధ గల అధికారులు లేక చనిపోతున్నారు. షాపులనిండా మందులు, పుస్తకాలు, పుస్తకాల నిండా ఉన్న వైద్య నైపుణ్యం, రోగులకు అందుబాటులో లేక ఏజన్సీతో పాటు, వైుదాన ప్రాంత ప్రజలు చనిపోతున్నారు.

హిందూత్వ ఎజెండాతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగాimage ప్రవేశపెట్టారు. దీని కోసం కోటాను కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికి ఈ కార్యక్రమం నాయుకులు, సెలబ్రిటీలు చీపుర్లు పట్టుకొని ఫోటోలకు పోజులివ్వడం, ఉపన్యాసాలివ్వడం వరకు మాత్రమే పరిమితం అయ్యింది తప్ప పరిశుభ్రతకు నోచుకోలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఆరోగ్య మిషన్, అందరికీ ఆరోగ్యం, తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి కేసీఆర్ కిట్ల పంపిణీ, అమ్మబడి కంటి వెలుగు, ఎఎన్‌ఎంలకు ట్యాబ్‌లు అందించడం, బయోవెుట్రిక్ విధానం, ఆన్‌ైలెన్‌లో ఉంచేలా ఎఎన్‌ఎంలకు శిక్షణ వంటి నినాదాలు మీడియాలో ప్రచారార్భాటానికి మాత్రమే పరిమితైవెుపోయాయి. ఏజన్సీలోని వైద్యవ్యవస్థకు కాల్బలం కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, వీరిని ప్రవేశ పెట్టింది కూడా ప్రపంచ బ్యాంకు సలహా మేరకే ఏజన్సీలో గ్రామ గ్రామాన వున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు అదే గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళలే వుంటారు. వీరికి కనీస ఆర్థిక భద్రత కల్పించి తగు మాత్రం శిక్షణ ఇప్పించాలి. కాని ఇదేమి లేకుండా పారాసటమాల్ బిళ్ళలు, క్లోరోక్విన్ బిళ్ళలు ఇచ్చి జనం మీదరకు వదిలేస్తే ప్రయోజనవేుముంటుంది. 

 అంతేగాకుండా గ్రామాల్లో అంగన్ వాడీ కేంద్రాలల్లో చిన్న పిల్లలకు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూలు పిల్లలకు పౌష్టికాహారం అందించే ఏర్పాటు వుంది. కావలసినన్ని నిధులు, సక్రమంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. ఏన్ని వున్న వ్యవస్థలో సంకల్పం లేనిదే ఏం ప్రయోజనం? సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న సలహాలు చెప్పే కాడ కూడా ప్రభుత్వం లేకపోవడం కడు శోచనీయం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఏరియా వైద్యశాలలు, సామాజిక వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు సరిపడా వైద్యుల్లేక మందుల కొరతతో విరాజల్లుతున్నాయి.

ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మున్సిపాలిటిలు, గ్రామ పంచాయుతీలు నిధులు కేటాయించటంలో మీనమిషాలు లెక్కించటం రివాజుగా మారిన దరిమిలా ప్రజల ప్రాణాలు ఈ సీజన్‌లో జ్వరాలు, విషజ్వరాలు కోరల్లో చిక్కుకొని హరీమంటున్నాయి. రోగాన్ని నయం చేయుడంకన్నా రోగం రాకుండా ముందు జాగ్రత్త పడలన్న సావెుతను ఏనాడో మర్చిపోవడం వల్లే ఏటా వర్షాకాలం ప్రారంభం కాగానే అటు ఏజన్సీ ప్రాంతంలోనూ ఇటు వైుదాన ప్రాంతంలోనూ జ్వరాలు, విషజ్వరాలు పెరుగుతున్నాయి. సీజనల్ వ్యాధులకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ వైఫల్యం మరోసారి తేట తెల్లు అయ్యింది. ప్రధానంగా ఏజన్సీ ప్రాంతంలో, గిరిజన గూడెలల్లో పరిస్థితి మరీ దయునీయంగా వున్నది. వైద్య సౌకర్యాలు సక్రమంగా లేవు. 4, 5 గూడేలకు కల్పి ఒక ఒక పీహెచ్‌సీ వుండటం అందులో వైద్యుల కొరత, అరకొరగా వున్న వైద్యులు, ఆయా గ్రామాలల్లోనే వుండాలన్న నియుమాన్ని ఏనాడో మరిచిపోయారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపం కారణంగా యావత్ దేశంలోని ప్రధాన పట్టణాలు మొదలు కొని మారుమూల ఏజన్సీ గిరిజన గ్రామాల వరకు ఇదే పరిస్థితి అలముకున్నది.

అతిసారం, మలేరియా, విషజ్వరాలు ఆదివాసులకే ఎందుకొస్తాయి? ఆదివాసులకు మాత్రమే రావు ఇతరులకు కూడా వస్తుంటాయి. ఐతే డబ్బు గల వాళ్ల కంటే లేని వాళ్లకెక్కువగా కులం గల వాళ్ల కంటే లేని వాళ్ళేకెక్కువగా, పట్టణ వాసులకంటే పల్లె వాళ్ళకెక్కువగా, అందరికంటే ఆదివాసీల కెక్కువగా వస్తుంటాయి. మలేరియా బారినపడే ప్రతీ వెయ్యి మందిలో సుమారు 25 మంది ఆదివాసీలే వుంటున్నారు. ప్రసవం సమయంలో స్త్రీలు (ఆదివాసీ) పసితనంలోనే చనిపోతున్నారు. పోషకాహరలోపం, రక్షిత మంచి నీటి ఏర్పాటు లేకపోవడం, పరిసరాల పారిశుధ్యంలో లోపం, అందుబాటులో వైద్య, సదుపాయాలు లేకపోవటం వైద్య సదుపాయాలున్నట్లు కాగితాల మీద చెప్పుకున్నచోట కూడా డాక్టర్లు, ఇతర సిబ్బంది గైర్హాజరుకావడం, మందుల ధరలు అందుబాటులో లేకుండా పెరిగిపోవడం ఈ పరిస్థితికి కారణంగా పేర్కొనవచ్చు. ఫార్మా కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వాలు జనరిక్ మందులు వెలుగులోకి తీసుకోరాకపోవడం మరో కారణం కనుక జనరిక్ మందుల వాడకాన్ని ప్రజలకు తెలిపి ప్రభుత్వమే ఉచితంగా అందించాలి.

పట్టణాల్లోని ప్రభుత్వాస్పత్రిలోనే వైద్యులుంటే మందులుండవు, మందులుంటే వైద్యులుండని పరిస్థితి సర్వసాధారణైమెంది. ఇక గ్రామాల వైద్య సౌకర్యాలు పట్టించుకునే దెవరు? ప్రభుత్వ ఆరోగ్య శాఖలపై నమ్మకం లేక రోగాలబారిన పడిన ప్రజలు గత్యంతరం లేక ప్రైవేటు ఆసుపత్రుల నాశ్రయిస్తుంటే అవి బతికుండగానే వారి రక్తమాంసాలను పిండి పిప్పి జేస్తున్నాయి. ఈ సంవత్సరం ఇప్పటికే కొన్ని వందల ప్రాణాలు పోయాయి. పోయిన ప్రాణాలను లెక్కబెట్టవచ్చునేమోగాని తమ ఆప్తులను పోగొట్టుకున్న వారి బాధను, తన కన్న పిల్లలు కళ్ళ ఎదుటే జ్వరానికి బలి అవుతుంటే నిస్సహాయంగా చూడటం తప్ప ఏమి చెయ్యలేని ఆదివాసీ గిరిజన తల్లిదండ్రుల ఆవేదనను ఎవరు లెక్కగట్టగలరు!

పేదరికం, పోషకాహార లోపం, దోమల బెడద, కల్పించిన సమస్యను, వైద్య పారిశుధ్య వ్యవస్థలను, పని గట్టుకొని నాశనం చేసిన బాధ్యతారహిత పాలనా విధానాలు ఎన్నోరెట్లు పెరిగాయి. అన్ని కోణాల నుండి పరిస్థితిని చక్కబెట్టే బృహత్తర ప్రయత్నం ఇప్పటికే మొదలు కావలసివుంది. కాని కాలేదు. ప్రజలు ఒత్తిడి పెంచి మొదలు పెట్టించకపోతే వచ్చే వర్షాలూ, అవి తెచ్చే రోగాలు ఎంతో దూరం లేవు.

- రామటెంకి అశోక్
8096080113 

English Title
Where is Doctors in the agency ..?
Related News