‘యన్.టి.ఆర్’ చిత్రానికి దర్శకుడెవరు?

Updated By ManamSat, 04/28/2018 - 19:38
ntr

ntrనందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా నుంచి దర్శకుడు తేజ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.  కె.రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, క్రిష్, కృష్ణవంశీ.. ఇలా కొంత‌మంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి దర్శకుడు ఖరారు కాలేదు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి మరో వార్త ప్రచారంలో ఉంది. అదేమిటంటే.. ఈ చిత్రంలో నటిస్తూ నిర్మిస్తున్న నందమూరి బాలకృష్ణే దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడతారని.. తన తండ్రి జీవిత కథను తానే రూపొందిస్తే బాగుంటుందన్నది ఆయ‌న‌ ఆలోచన అని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

English Title
who is 'NTR' movie director?
Related News