రావణ్, దుర్యోధన్ అనే పేర్లు ఎందుకు పెట్టలేదు..?

Updated By ManamMon, 11/05/2018 - 10:17
Yogi Adityanath

Yogi Adityanathలఖ్‌నౌ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రాచీన నగరం అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని పలువురు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా స్పందించిన యోగీ ఆదిత్యనాథ్.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

‘‘అలహాబాద్‌ పేరును నేను మార్చాలనుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. కొంతమంది అసలు పేరులో ఏముంది అని ప్రశ్నించారు. ఇప్పుడు నేను వారి తల్లిదండ్రులను అడుగుతున్నా.. ఆందోళన చేస్తున్న వారి పేర్లను రావణ్, దుర్యోధన్ అని ఎందుకు పెట్టలేదు. ఈ దేశంలో పేర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. అలాగే అలహాబాద్ మొదటి పేరు ప్రయాగ్ అని.. 1575లో మొఘల్ చక్రవర్తి అక్బర్ దానిని ఇలాహాబాద్‌గా మార్చాడని ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్న మొఘల్‌సరై రైల్వే స్టేషన్ పేరును కూడా దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్‌గా యోగీ ప్రభుత్వం మార్చిన విషయం తెలిసిందే.

English Title
Why Isn't Your Name Raavan?": Yogi Adityanath Defends Allahabad Renaming
Related News