అందుకే కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు..

Updated By ManamSat, 09/08/2018 - 15:35
konda surekha-konda murali
mla vinay bhaskar

హైదరాబాద్ : పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... గతంలో కొండా దంపతులు తమకు రాజకీయ జీవితం ప్రసాదించాలని వేడుకుంటేనే కేసీఆర్ వారిని పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. మొదటి నుంచి కూడా కొండా దంపతుల ప్రవర్తన మంచిగా లేదన్నారు. టీడీపీ, కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్ సీపీ, అనంతరం కాంగ్రెస్... ఆ తర్వాత టీఆర్ఎస్‌కు వచ్చారన్నారు. తానే స్వయంగా వాళ్లను కేటీఆర్‌ దగ్గరకు తీసుకు వెళ్లానన్నారు. 

konda surekha-konda murali

కేసీఆర్ నిబంధనలు ఒప్పకున్న కొండా దంపతులు ఈరోజు... పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ నాయకత్వం కిందే అందరం పని చేస్తామని, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకూ పని చేస్తామన్నారు. కేటీఆర్ కోటరీ అంటూ ఏమీ లేదన్నారు. తొలినుంచి వారికి క్రమశిక్షణ లేదని, అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని వినయ్ భాస్కర్ విమర్శించారు. కొండా సురేఖకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు ఆమె భర్త కొండా మురళికి కూడా సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు.

ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలే గానీ, మీడియా కెక్కడం సరికాదని అన్నారు. కొండా దంపతులు పార్టీ నుంచి వెళ్లిపోయినా వచ్చే నష్టమేమీ లేదన్నారు.  పార్టీని గతంలో ఎంతోమంది కేసీఆర్‌ను ధిక్కరించి వెళ్లారని, ఆ తర్వాత వాళ్లకు పుట్టగతులు లేవని అన్నారు.  రానున్న ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు.

English Title
why Konda Surekha Name Not There in TRS Candidates List
Related News