మెసేంజర్ యాప్‌లో ప్రియుడితో స్కెచ్ వేసి.. భర్తను చంపిన భార్య

Updated By ManamWed, 09/12/2018 - 11:40
Murder

Murderఅమరావతి: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపింది భార్య. మెసేంజర్ యాప్ ద్వారా స్కెచ్ వేసి తన భర్తను చంపేసి ఏమీ తెలీనట్లు ఉండిపోయింది ఆ భార్య. గత నెల 26న అనుమానాస్పద స్థితిలో భర్త మరణించగా.. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.

కాగా తోటవారిపల్లె వీధికి చెందిన రాంబాబు, ప్రియదర్శిని 17ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నుంచి ఈ ఇద్దరి మధ్య తరచుగా తగాదాలు వస్తుండగా.. ఆ క్రమంలో ప్రియదర్శినికి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు శివసాయి కిశోర్. ఇంట్లో తగాదాల వలన భర్తను వదిలిపెట్టి ప్రియుడితో చెన్నైకి చెక్కేసింది ప్రియదర్శిని. అయితే పోలీసుల సాయంతో మళ్లీ ప్రియదర్శినిని వెనక్కి తెచ్చుకున్నాడు రాంబాబు. 

ఇక ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ప్రియదర్శిని.. ఇటీవల మెసేంజర్ యాప్ ద్వారా ప్రియుడు కిశోర్‌తో ముచ్చట్లు మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరగడంతో రాంబాబును చంపేందుకు వారిద్దరు ప్రణాళికను వేసుకున్నారు. గత నెల 26న కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రియదర్శిని, రాంబాబుకు ఇవ్వగా అతడు నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాత వారి ఇంటికి వచ్చిన కిశోర్, ప్రియదర్శిని సాయంతో రాంబాబు గొంతు నలిపి చంపేశాడు. అనంతరం కేసు తన మీదకు రాకూడదని కిశోర్‌కు 2లక్షల రూపాయలను కూడా ఇచ్చింది. అయితే పోస్ట్‌మార్టంలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు ప్రియదర్శినిని ప్రశ్నించగా నిజం బయటికొచ్చింది. వెంటనే ప్రియదర్శిని, కిశోర్‌లపై కేసును నమోదుచేసుకున్న పోలీసులు వారిద్దరి తమ అదుపులోకి తీసుకున్నారు.

English Title
Wife killed husband in Andhrapradesh
Related News