జ్యోతిక పాత్ర‌లో అనుష్క‌?

Updated By ManamFri, 03/02/2018 - 15:46
jyothika

anushkaహీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన తార‌ల‌లో జ్యోతిక‌, అనుష్క‌ను ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు. త‌మిళ‌నాట ఇలాంటి చిత్రాల‌తో జ్యోతిక ఆక‌ట్టుకుంటే.. తెలుగు నాట ఈ త‌ర‌హా చిత్రాల‌లో అనుష్క మెప్పించారు. ఇదిలా ఉంటే.. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు బాలా ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిక ఓ సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. 'నాచియార్' పేరుతో రూపొందిన ఈ త‌మిళ‌ చిత్రంలో జ్యోతిక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించారు. ఈ చిత్రానికి అక్క‌డ మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను క‌ల్ప‌న కోనేరు కొనుగోలు చేశారు. అంతేగాకుండా, చిత్ర ద‌ర్శ‌కుడు బాలా స‌ల‌హా మేర‌కు అనుష్క‌తో ఈ చిత్రం రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని స‌మాచారం. 'భాగ‌మ‌తి' త‌రువాత మ‌రో చిత్రానికి సంత‌కం చేయ‌ని అనుష్క‌.. ఈ రీమేక్ చేస్తారా? లేదా అనేదానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. 

అన్న‌ట్టు.. త‌మిళ చిత్రం 'శ‌కుని'లో అనుష్క పోలీస్ అధికారి పాత్ర‌లో కాసేపు త‌ళుక్కున మెరిసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత మ‌ళ్ళీ ఆ త‌ర‌హా పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నేలేదు. ఈ రీమేక్ కార్య‌రూపం దాల్చితే.. పూర్తి స్థాయి  పోలీస్ పాత్ర‌లో అనుష్క‌ని తెర‌పై చూసే అవ‌కాశం ఆమె అభిమానుల‌కు ద‌క్కిన‌ట్టే.

English Title
will anushka do jyothika film?
Related News