ప్రియాంక బ్యాగ్ ధరతో కారునే కొనేయవచ్చు

Updated By ManamThu, 06/14/2018 - 11:27
priyanka

priyanka  సెలబ్రిటీలే కాదు అప్పుడప్పుడు వారు వాడుతున్న వస్తువులు కూడా వైరల్‌గా మారుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా వాడుతున్న బ్యాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల పాప్ సింగర్, హాలీవుడ్ యాక్టర్ నిక్ జోనాస్‌తో కలిసి ప్రియాంక డిన్నర్‌కు వెళ్లగా ఆ సందర్భంగా కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. వాటిలో ప్రియాంక వాడుతున్న బ్యాగ్‌పై అందరి దృష్టి పడింది. 

వెరైటీ డిజైన్‌తో ఉన్న ఆ బ్యాగ్ అందరినీ ఆకట్టుకుంటుండగా.. దాని ధరను చూసి అందరూ నోరెళ్లపెడుతున్నారు. ఎందుకంటే దాని ధరతో ఓ కారును కొనుక్కోవచ్చు మరి. ఇంతకు ఆ బ్యాగ్ ధర ఎంత అనుకుంటున్నారా..? అక్షరాల 4.6లక్షల రూపాయలు. ఈ విషయం తెలిసిన పలువురు ఈ బ్యాగ్ కంటే టియాగో కారు ధరనే (దాదాపు రూ.3.56లక్షలు) తక్కువని వ్యాఖ్యానిస్తున్నారు.

English Title
Will buy a car with Priyanka's hand bag price
Related News