నచ్చిన అమ్మాయిలకు ప్రపోజ్ చేయండి.. తిరస్కరిస్తే కిడ్నాప్ చేయండి

Updated By ManamWed, 09/05/2018 - 08:42
Ram Kadam

Ram Kadamముంబై: ఎవరైనా అమ్మాయి నచ్చితే ప్రపోజ్ చేయండి, తిరస్కరిస్తే కిడ్నాప్ చేయండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రామ్ కడామ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. క‌‌ృష్ణాష్టమి సందర్భంగా దహీ హండీ వేడుకల్లో కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘అబ్బాయిలందరికీ నేను అండగా ఉంటాను. నచ్చిన అమ్మాయిలకు మీరు ప్రపోజ్ చేయండి. తిరస్కరిస్తే వాళ్లని మీరు కిడ్నాప్ చేయండి. లేదంటే నాకు చెప్పండి. మీ తల్లిదండ్రులతో మాట్లాడి నేనే దగ్గరుండి కిడ్నాప్ చేసి ఆమెతో మీ పెళ్లి జరిపిస్తాను’’ అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరల్‌గా మారింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులే ఇలా మాట్లాడుతుంటే స్త్రీలకు రక్షణ ఎక్కడుంటుందని పలువరు నెటిజన్లు రామ్ కడామ్‌పై మండిపడుతున్నారు. అయితే వేదికపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు ఉండగానే రామ్ కడామ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనర్హం. అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేం కాదు. గతంలో కూడా అమ్మాయిలపై ఆయన పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

English Title
Will kidnap women for you: Ram Kadam
Related News