పవన్ సభలో ఏం చెప్పబోతున్నారు?

Updated By ManamWed, 03/14/2018 - 17:00
JanaSena Party Formation Day

JanaSena Party Formation Day

గుంటూరు: జనసేన పార్టీ నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గుంటూరులోని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా పెద్దఎత్తున ఆవిర్భావ సభకు జనసేనాని పూనుకున్నారు. అయితే ఈ సభలో పవన్ ఏం చెప్పబోతున్నారు? "ఒకప్పుడు 2014 (ఎన్నికలు) తాను ప్రచారం చేసి గెలుపునకు ప్రధాన కారణమైన సీఎం చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతాడా?.. లేదా దించుతాడా?. బీజేపీని పెంచుతుడా? దంచుతాడా?. వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కడ్నుంచి.. ఎంత మందిని రంగంలోకి దింపనున్నారనే విషయాన్ని సభావేదికగా ప్రకటిస్తారా?. అసలు వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పవన్ బరిలోకి దిగుతారా?. వైసీపీ నుంచి గత కొద్దిరోజులుగా పెద్దఎత్తున విమర్శలు వస్తుండటంతో సభా వేదికగా ప్రతివిమర్శలు గుప్పిస్తాడా?. తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వారికి కౌంటర్ ఎటాక్ చేయనున్నారా?" అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఓ వైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర.. మరో వైపు జనసేన ఆవిర్భావ సభతో గుంటూరు రాజకీయాల్లో వేడెక్కింది. అసలు ఆవిర్భావ సభలో పవన్ ఏం చెప్పబోతున్నారన్నే దానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేలాది మంది కార్యకర్తలు, పవన్ అభిమానులు సభకు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సభ ప్రారంభం కాకమునుపే కార్యకర్తలపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.

English Title
Will Pawan Counter Attack On BJP & TDP & YSRCP
Related News