'డీఎస్సీపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం' 

Updated By ManamTue, 09/04/2018 - 20:44
Ganta Srinivasa rao, DSC Posts, AP cabinet meeting

Ganta Srinivasa rao, DSC Posts, AP cabinet meetingవిజయవాడ: డీఎస్సీ పరీక్షపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్సీ పోస్టులకు సంబంధించి వివరాలను సిద్ధం చేశామన్నారు. ఈనెల 6న జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో డీఎస్సీపై ఓ నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి సంబంధిత అధికారులు, డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇందులో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది సమ్మె నోటీసు అంశంపై చర్చిస్తామన్నారు. అదేవిధంగా నూజివీడు ట్రిపుల్‌ ఐటీపై వస్తోన్న అనేక విమర్శలపైనా సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా స్పష్టం చేశారు. 

English Title
will take decision on DSC posts, says Ganta Srinivasa rao
Related News