W/O రామ్ మూవీ రివ్యూ

Updated By ManamFri, 07/20/2018 - 12:25
manchu
manchu

బ్యాన‌ర్‌: మ‌ంచు ఎంట‌ర్‌టైన్ మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ
ఆర్టిస్ట్స్ : మంచు లక్ష్మీ, శ్రీకాంత్ అయ్యంగార్‌, ప్రియదర్శి, ఆదర్శ్‌, సామ్రాట్ త‌దిత‌రులు
మ్యూజిక్ : రఘు దీక్షిత్‌
కెమెరా:  సామ‌ల భాస్క‌ర్‌
ఎడిటింగ్‌: బిక్కిన తిమ్మరాజు
కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిభొట్ల 
ప్రొడ్యూస‌ర్స్ : టీజీ విశ్వప్రసాద్‌, మంచు లక్ష్మీ
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైర‌క్ష‌న్‌: విజయ్ యెలకంటి

త‌క్కువ బ‌డ్జెట్‌లో, కొత్త ద‌ర్శ‌కుల‌తో, మీనింగ్ ఫుల్ సినిమాలు చేయ‌డానికి త‌న‌వంతు కృషి చేస్తుంటారు ల‌క్ష్మీ మంచు. తాజాగా ఆమె న‌టించిన అలాంటి సినిమా `వైఫ్ ఆఫ్ రామ్‌`. బుగ్గ‌మీద గాయంతో, హెల్మెట్ పెట్టుకుని స్కూట‌ర్‌ని న‌డుపుతున్న ఆమె స్టిల్స్ ఇప్ప‌టికే ఈ సినిమాలో ఏదో చెప్ప‌బోతున్నార‌నే విష‌యాన్ని కన్విన్స్ చేశాయి. మ‌రి ఆ విష‌యాలేంటి? `వైఫ్ ఆప్ రామ్‌` ఏం చెప్పాల‌నుకుంటుంది? ఆమె భ‌ర్త‌కు ఏమైంది? ఆ ఒంటిమీద గాయాలేంటి? వ‌ంటివి తెలియాలంటే `వైఫ్ ఆఫ్ రామ్‌` చూడాల్సిందే. ఇప్పుడు మీరు ఇక్క‌డ చ‌ద‌వాల్సిందే.

క‌థ‌
 దీక్ష (ల‌క్ష్మీ మంచు) ఎన్జీఓలో ప‌నిచేస్తుంది. ఆమె భ‌ర్త రామ్ (సామ్రాట్‌). అన్యోన్యంగా సాగే వారి కుటుంబానికి నిద‌ర్శ‌నంగా ఆరు నెల‌ల గ‌ర్భ‌వ‌తిగా ఉంటుంది దీక్ష‌. ఓ రోజు రెసార్ట్ లో ఉండ‌గా సూసైడ్ పాయింట్ నుంచి వీళ్లిద్ద‌రూ కింద‌ప‌డ‌తారు. దీక్ష బిడ్డ క‌డుపులో చ‌నిపోతుంది. భ‌ర్త రామ్ కూడా క‌న్నుమూస్తాడు. అయితే త‌న భ‌ర్తని ఎవ‌రో చంపార‌ని, అది ప్ర‌మాదం కాద‌ని చెబుతుంది దీక్ష‌. ఆమె మాట‌ల‌ను ఎస్ ఐ స‌త్యం (శ్రీకాంత్ అయ్యంగార్‌) ప‌ట్టించుకోడు. అయితే ఆమె మాట‌ల్లో నిజాయతీ ఉంద‌ని న‌మ్ముతాడు ర‌మ‌ణాచారి (ప్రియ‌ద‌ర్శి). ఆమెకు సాయం చేస్తాడు. దాంతో స్వ‌యంగా రంగంలోకి దిగి సాక్ష్యాల‌ను సేక‌రిస్తుంది దీక్ష‌. ఆ ప్ర‌యత్నంలో భాగంగానే రాఖీ (ఆద‌ర్శ్‌) అనే వ్య‌క్తి గురించి తెలుసుకుంటుంది. త‌న భ‌ర్త‌కు రాఖీకి సంబంధం ఏంటి? అనేది సినిమాలో కీల‌కం. 

ప్ల‌స్ పాయింట్లు
- ల‌క్ష్మీ మంచు 
- నిర్మాణ విలువ‌లు
- కెమెరా
- సంగీతం

మైన‌స్ పాయింట్లు
- నో కామెడీ
- అక్క‌డ‌క్క‌డా వేస్ట్ సీన్స్
- రిపీటెడ్ సీన్స్
- స్లో పేస్‌లో వెళ్లిన స్క్రీన్‌ప్లే

స‌మీక్ష‌
తెలిసిన వారు, తెలియ‌నివారు, ఇంట్లో వారు, బ‌య‌టివారు అనే తేడా లేకుండా రేప్‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. నిద్ర‌లేవ‌గానే `వ్య‌క్తి మృతి` అనే వార్త‌ల‌ను చ‌దివినంత తేలిగ్గా రేప్ వార్త‌ల‌ను చ‌దువుతూనే ఉన్నాం. అమ్మాయికి చెప్పే జాగ్ర‌త్త‌ల్ని అబ్బాయిల‌కు చెప్పి పెంచ‌డం లేదు. చెప్పాలి.. త‌ప్ప‌కుండా ఏది మంచో, ఏది చెడో అబ్బాయిల‌కు చెప్పాలి.  చెప్పినా విన‌క‌పోతే క‌న్న బిడ్డ‌యినా, క‌ట్టుకున్న‌వాడ‌యినా క‌డ‌తేర్చాలి. ఇంకో అమ్మాయి జోలికి వెళ్తే మ‌ర‌ణం త‌ప్ప‌ద‌నే విష‌యాన్ని తెలియ‌జేయాలి. స్వార్థాన్ని ఆలోచించుకుని, ధ‌ర్మాన్ని దూరంగా పెట్టకూడ‌దు. `వైఫ్ ఆఫ్ రామ్‌` చిత్రంలో మంచు ల‌క్ష్మీ చెప్ప‌ద‌ల‌చుకున్న విష‌యం ఇదే. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు విజ‌య్ య‌ల‌వ‌ర్తి సెన్సిటివ్‌గా తీశాడు. చెప్పాల‌నుకున్న విష‌యం మీద స్ప‌ష్ట‌త ఉంది. కొన్ని సీన్లు బావున్నాయి. కొత్త‌గానూ అనిపిస్తాయి. కాక‌పోతే అక్క‌డ‌క్క‌డా చూపించిన స‌న్నివేశాల‌నే మ‌ర‌లా చూపించి విసుగు తెప్పించారు. ప్రియ‌ద‌ర్శిలాంటి న‌టుడిని, శ్రీకాంత్‌లాంటి న‌టుడినీ ఉంచుకుని కామెడీ డైలాగుల‌ను రాయించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో దీక్ష చేసిన ప‌లు అంశాలు వాస్త‌వానికి దూర‌మ‌న్న సంగ‌తిని కూడా గుర్తుంచుకోవాలి. కాక‌పోతే నేటి స‌మాజానికి అద్దంప‌ట్టే మంచి క‌థ ఇది.

రేటింగ్‌: 2.5/5

బాట‌మ్ లైన్‌: స‌మాజానికి సినిమా రూపం

English Title
W/O Ram movie Review
Related News