భవనం కూలి ఐదుగురు దుర్మరణం

Updated By ManamWed, 09/26/2018 - 15:38
four children, one woman dead as 3-storey building collapses in Delhi
four children, one woman dead as 3-storey building collapses in Delhi

ఢిల్లీ : ఢిల్లీలో మూడంతస్తులు భవనం కూలి మహిళతో పాటు నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఢిల్లీలోని అశోక్ విహార్‌లో బుధవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను దీప్ చంద్ బంధు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మహిళను మున్నీగా గుర్తించారు. ఉదయం 9.25 గంటలకు ఈ సంఘటన జరిగింది. 

ప్రమాద సమచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకున్నవారిని వెలికి తీస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

English Title
Woman, four Children Dead As three-Storey Building Collapses In Delhi
Related News