మహిళపై మాజీ భర్త దారుణం...

Updated By ManamFri, 11/09/2018 - 12:21
Woman gang raped in jharkhand
  • మహిళపై స్నేహితులతో కలిసి మాజీ భర్త సామూహిక అత్యాచారం

Woman gang-raped

జంతార: ఓవైపు నిర్భయ చట్టం అమలు అవుతున్నా, మరోవైపు మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఓ మహిళపై తన స్నేహితులతో కలిసి మాజీభర్త దారుణానికి ఒడిగట్టాడు. సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించి మహిళ మరణానికి కారణం అయ్యారు. జంతర జిల్లాలోని నారాయణపురా పోలీస్‌ స్టేషన్‌లో  పరిధిలో  గతరాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... స్థానికంగా నివాసం ఉంటున్న మహిళ ...సమీపంలోని  కాళీపూజా థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెను  మాజీభర్త... తన ఇద్దరు స్నేహితులతో కలిసి అటకాయించి, బలవంతంగా సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ మృగాళ్లు... ఆమె ప్రయివేట్ భాగాల్లో కర్రను జొప్పించి, చిత్రహింసలకు గురి చేశారు. 

అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో పడిఉన్న మహిళను స్థానికులు గమనించి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మహిళ మాజీ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English Title
Woman gang-raped stick inserted in private parts in Jharkhand
Related News