కాన్పు.. మహిళలకు ఆయు హీనం

Updated By ManamSun, 03/11/2018 - 14:52
representational
  • పిల్లల్ని కంటే ఆయుష్షులో 11 ఏళ్ల కోత

representationalవాషింగ్టన్: కాన్పు పునర్జన్మతో సమానమంటుంటారు పెద్దలు. కానీ, అదే కాన్పు మహిళల ఆయుష్షును తగ్గిస్తుందని చెబుతున్నారు పరిశోధకులు. ఒకటికాదు రెండు కాదు.. పిల్లల్ని కంటే ఆయుష్షులో 11 ఏళ్లు కరిగిపోతాయట. అమెరికాలోని జార్జ్ మేసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. దానికి కారణం ఒక్కసారి కాన్పు జరిగితే మహిళల డీఎన్ఏల్లోని టెలోమీర్ల పొడవు తగ్గిపోతోందని అంటున్నారు. డీఎన్ఏ రెప్లికేషన్‌కు తోడ్పడే ఈ టెలోమీర్ల పొడవు తగ్గిపోవడం ఆయువుపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. పిల్లలు లేని మహిళలతో పోలిస్తే కాన్పులు జరిగిన ఆడవాళ్లలో మాత్రమే టెలోమీర్ల పరిమాణం తగ్గిపోతోందని గుర్తించారు. వాస్తవానికి మరణానికి, ఆయుష్షుకు టెలోమీర్లతో సంబంధం ఉందని ఇంతకుముందే శాస్త్రవేత్తలు గుర్తించినా.. కాన్పులతో టెలోమీర్లను లింకుపెట్టడం మాత్రం ఇదే తొలిసారి. అయితే, కాన్పులొక్కటే టెలోమీర్ల పరిమాణం తగ్గిపోవడానికి కారణంగా పరిగణించలేమని, ఒత్తిడి, సామాజిక అంశాలు వంటి కారణాలూ అందుకు దోహదపడుతుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

English Title
Women Life Span will get effected by pregnancy
Related News