అవెురికాపై ప్రతీకార సుంకాలకు కసరత్తు

Updated By ManamThu, 06/21/2018 - 06:17
modi trump
  • భారత్ ద్వైపాక్షిక చర్చలకు ప్రాధాన్యమిస్తూనే 

  • సుంకాలు పెంచాల్సిన వస్తువుల జాబితాను సిద్ధం చేసుకుంటోంది

imageన్యూఢిల్లీ: అవెురికా నుంచి దిగుమతి చేసుకుంటున్న బాదంపప్పు, యాపిల్ పండ్లు, కొన్ని రకాల రసాయనాలు వంటి వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించడానికి సంబంధించి ఇండియా చివరి నిమిష కసరత్తులలో ఉంది. తీసుకునే చర్య తగినంత ప్రభావం చూపించేదిగా ఉండాలని భారత్ భావిస్తోంది. సుంకాల తుది జాబితా గురువారంనాటికి లేదా ఈ వారాంతానికి సిద్ధం కాగలదని భారత్ భావిస్తోంది. ‘‘మన ఉక్కు, అల్యూమినియంను (దిగుమతి సుంకాలు విధించడం ద్వారా) తప్పుగా శిక్షించినందుకు, అవెురికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఏయే వస్తువులపై మనం సుంకాలు విధించాలనుకుంటున్నామో ఆ జాబితాను ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యు.టి.ఓ)కు నోటిఫై చేసినప్పటికీ, మేం ఇంకా ఏవైనా కేటగిరీలను విడచిపెట్టామేమో ఇంకా పరిశీలిస్తున్నాం. కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాల రేట్లను పెంచవలసిన అవసరం గురించి కూడా చర్చిస్తున్నాం’’ అని ప్రభుత్వాధికారి ఒకరు చెప్పారు. హెచ్చు సుంకాల వ్యవస్థకు సంబంధించిన ముఖ్యైమెన కోణాలను, వివరాలను జూన్ 21 కల్లా ఖరారు చేసేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సహాయంతో రెవిన్యూ శాఖ ఊపిరి సలపని రీతిలో పనిచేస్తోంది. జూన్ 21 నుంచి ఈ సుంకాలు విధించనున్నట్లు ఇండియా డబ్ల్యు.టి.ఓకు తెలియజేసింది.

ఇండియా ప్రతిపాదిత చర్య వల్ల అవెురికాపై ఫైనాన్షియల్ ప్రభావం 165 మిలియన్ డాలర్ల నుంచి 241 మిలియన్ imageడాలర్ల శ్రేణిలో ఉండవచ్చని భావిస్తున్నారు. అవెురికా జాతీయ భద్రత అంశాలను సాకుగా చూపుతూ భారతీయ ఉక్కు, అల్యూమినియంపై వరుసగా 25 శాతం, 10 శాతం అదనపు దిగుమతి సుంకాలను విధించింది. దాని ప్రభావాన్ని తటస్థీకరించే ఉద్దేశంతో ప్రతిగా సుంకాలు విధించాలని భారత్ నిర్ణయించుకుంది. ప్రతీకార సుంకాలకు సంబంధించి డబ్ల్యు.టి.ఓకు సమర్పించిన తాజా నోటిఫికేషన్‌లో ఇండియా 30 వస్తువుల జాబితాను ప్రతిపాదించింది. అందులో యాపిల్ పండ్లు, అక్రూడ్ పప్పు, బాదం పప్పు, (హార్లీ డేవిడ్‌సన్‌తో సహా) విలాసవంతైమెన మోటారు సైకిళ్ళు, మసూరి పప్పు, ఫాస్ఫారిక్ యాసిడ్ వంటివి ఉన్నాయి. వాటిపై సుంకాలు 10-50 శాతం పెరిగే అవకాశం ఉంది. 

బౌండ్ రేట్లు
బాదంపప్పుపై రేట్లు పెంచడం ద్వారా ప్రతీకార సుంకంలో అధిక భాగాన్ని చేజిక్కించుకోవాలని ఇండియా ఆశిస్తోంది. భారతదేశం గత ఏడాది 60 కోట్ల డాలర్ల విలుైవెన బాదంపప్పును దిగుమతి చేసుకుంది. ‘‘బాదంపప్పు లేదా యాపిల్ పండ్లతో పోలిస్తే, ఖరీైదెన మోటారు సైకిళ్ళ వంటి వస్తువులపై రేట్లు పెంచడం ద్వారా మనం వసూలు చేసే సుంకం ఇసుక రేణువే అవుతుంది’’ అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. డబ్ల్యు.టి.ఓ వద్ద అంగీకరించిన దిగుమతి సుంకాల సీలింగ్‌ని బౌండ్  రేట్లు అంటారు. ప్రతీకార సుంకాలు ఆ పరిమితికన్నా ఎక్కువగానే ఉండవచ్చు. ఏ వస్తువుైపైనెనా ఇండియా ఎంత అధికంగాైనెనా దిగుమతి సుంకాన్ని పెంచవచ్చు. 

సంరక్షణ చర్యలపై ఒప్పందం
సంరక్షణ చర్యలపై ఒప్పందం కింద అవెురికాతో చర్చలు జరపాలని ఇండియా కోరుకుంటోంది. భారతదేశం నుంచి చేసుకుంటున్న దిగుమతులపై సుంకాలను రద్దు చేసే విధంగా అవెురికాకు నచ్చజెప్పాలని చూస్తోంది. కానీ, తాను విధించిన సుంకాలు ‘సంరక్షణ’ చర్యల కోవలోకి రావంటూ, చర్చల్లో పాల్గొనేందుకు వాషింగ్టన్ తిరస్కరించింది. ఆ తర్వాతనే, అవెురికన్ ఉత్పత్తులపై జూన్ 21 నుంచి ప్రతీకార దిగుమతి సుంకాలు విధించనున్నట్లు కౌన్సిల్ ఫర్ ట్రేడ్ ఇన్ గూడ్స్ వద్ద భారతదేశం ఒక నోటిఫికేషన్ దాఖలు చేసింది. అయితే, ఈ నెలలో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరిపేందుకు అవెురికా-ఇండియా ప్రయత్నిస్తున్నాయి. ఈ దశలో అధిక సుంకాలు విధిస్తే చర్చల ప్రక్రియకు ఆటంకం ఏర్పడవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖలో కొందరు అధికారులు భావిస్తున్నారు. వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు అవెురికా వర్తక ప్రతినిధి రాబర్ట్ లైట్‌జెర్‌తో ఈ నెల మొదట్లో సమావేశైవెునప్పుడు ద్వైపాక్షిక చర్చలకు పునాది పడింది. భారతదేశానికి అవెురికా పెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉంది. కడచిన ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 13 శాతం పెరిగి, 47.88 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కనుక, అవెురికాతో కయ్యం కొనితెచ్చుకోకూడదని ఢిల్లీ భావిస్తోంది. 

English Title
Work for retaliatory tariffs on Auverica




Related News