2018 మార్చి తరువాత యుగాంతం..?! 

Updated By ManamTue, 02/13/2018 - 13:30
world coming to an end,  Christian numerologist, David Meade

world coming to an end,  Christian numerologist, David Meadeత్వరలో ప్రపంచం అంతమైపోతుందంట. అవును. మీరు సరిగ్గానే చదివారు. మీ ఆలోచనలున్నింటిని కాసేపు పక్కనపెట్టేసి డేవిడ్ మేడే అనే వ్యక్తి చెప్పేది వినండి.. 2018లో ప్రపంచం అంతమైపోతుందా?.. యుగాంతం రానుందా? అంటే అవుననని అంటున్నారు క్రైస్తవ సంఖ్యా శాస్త్రవేత్త డేవిడ్ మేడే. చైనా క్యాలెండర్ ప్రకారం 2012లో యుగాంతమని అప్పట్లో జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత అంతా సర్దుకున్నాక.. మళ్లీ యుగాంతం 2017లోనే అంటూ గతంలో ఇదే శాస్త్రవేత్త డేవిడ్ ఊదరగొట్టేశారు కూడా. మళ్లీ ఇప్పడొచ్చి 2018లోనే యుగాంతం అంటూ ప్రకటించారు. యుగాంతం 2017లో అని చెప్పిన డేవిడ్ అంచనాలు తప్పడంతో వాటిని సవరిస్తూ 2018 మార్చి తరువాత ఎప్పుడైనా కొన్ని భయానక ఘటనలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

world coming to an end,  Christian numerologist, David Meadeవీటి ప్రభావంతో కల్లోలానికి దారితీసి ప్రపంచం అంతమైపోయే సమయం ఆసన్నమవుతోందని చెబుతున్నారు. ‘నేను ప్రతీ నెలా మరింతగా అధ్యయనం చేస్తున్నాను. నా అంచనా ప్రకారం.. 2018 వేసవిలో భయంకరమైన ఘటన జరగనుంది. ఈసారి వేసవి ఆరంభలోనే పెనుప్రమాదం పొంచివుందని గట్టిగా నమ్ముతున్నాను. 2018 మార్చిలో ఉత్తరకొరియా ప్రపంచ సూపర్ పవర్‌గా అవతరించనుంది’ అని మేడే పేర్కొన్నారు. తన విధ్వంసం సిద్ధాంతం ప్రకారం.. ప్లానెట్ ఎక్స్ (నిబిరు) ప్రపంచం అంతానికి దారితీస్తుందని మేడే బలంగా నమ్ముతున్నట్టు చెబుతున్నారు. చూద్దాం.. మళ్లీ ఈయన చెప్పిన అంచనాలు ఎంతమేరకు నిజమవుతాయో లేదో.. మరి.

world coming to an end,  Christian numerologist, David Meade

world coming to an end,  Christian numerologist, David Meade

English Title
Is world coming to an end in 2018? This numerologist thinks so
Related News