అట్టహాసంగా ప్రారంభమైన సాకర్ ప్రపంచకప్ పోటీలు 

Updated By ManamThu, 06/14/2018 - 21:49
 World Cup 2018 opening ceremony, Moscow dazzles as Robbie Williams, kick off tournament

World Cup 2018 opening ceremony, Moscow dazzles as Robbie Williams, kick off tournamentమాస్కో: సాకర్‌ ప్రపంచకప్‌ పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రష్యా రాజధాని నగరం మాస్కోలోని లుజ్నికి స్టేడియం 21వ ఫిపా ప్రపంచకప్‌ పోటీలకు వేదికగా నిలిచింది. ప్రారంభోత్సవంలో బ్రిటన్‌ పాప్‌ సింగర్‌ రాబీ విలియమ్‌సన్‌, రష్యన్‌ కళాకారిణి ఐదా గారిఫుల్‌నియా ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా జట్ల మధ్య తొలి పోరుతో ఈ క్రీడా సంగ్రామం ప్రారంభమైంది. మొత్తం 32 జట్లతో 32 రోజుల పాటు సాకర్ పోటీలు జరుగనున్నాయి. సాకర్‌ పోటీలను 11 నగరాల్లో, 12వేదికలపై పోటీలు నిర్వహించనున్నారు. ఈసారి ప్రపంచకప్‌లో ఐస్‌లాండ్‌, పనామా దేశాలు అరంగేట్రం చేయనున్నాయి.

బ్రెజిల్‌ అత్యధికంగా ఐదుసార్లు కప్‌ను గెలవగా, టోర్నీలో అత్యంత తక్కువ ర్యాంకు (70వ) జట్టు రష్యానే. గత 15 మ్యాచ్‌ల్లో ఆ జట్టు కేవలం మూడు మాత్రమే నెగ్గగా, ప్రస్తుతం ఈ జట్టు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతోంది. సౌదీపై, రష్యా ఆశించిన స్థాయిలో ఎలా ప్రదర్శన చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇక ఈ పోటీల్లో విజేతగా నిలిచే జట్టుకు రూ.258 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది. గ్రూప్‌‌ స్థాయిలో నిష్క్రమించిన జట్టుకు కూడా రూ.58కోట్లు దక్కనున్నాయి. కాగా, బ్రెజిలియన్‌ గ్రేట్‌ రోనాల్డో, విల్‌ స్మిత్‌, నిక్కీ జామ్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

English Title
World Cup 2018 opening ceremony as it happened: Moscow dazzles as Robbie Williams helps kick off tournament
Related News