‘కేంద్రం చెప్పేదొకటి..చేసేదొకటి’

Updated By ManamTue, 07/31/2018 - 13:46
Yanamala
Yanamala ramakrishnudu

అమరావతి : కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయాలకు... వాస్తవాలకు పొంతన లేదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌పై ఆయన మంగళవారం అమరావతిలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..‘ఏపీకి ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకూ కేంద్రంతో పోరాడతాం.

పదో షెడ్యూల్‌లోని సంస్థలపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కేంద్రం అమలు చేయడం లేదు. సుప్రీంకోర్టు, చట్టసభలను కేంద్రం తప్పుదోవ పట్టిస్తోంది. రైల్వేజోన్‌పై కేంద్రం చెప్పిందొకటి..చేసిందొకటి. పార్లమెంట్‌లో చట్టానికే దిక్కు లేకపోతే ఎవరికి చెప్పాలి.   

రిజర్వేషన్లపై కేంద్రం చట్ట సవరణ చేయాల్సి ఉంది. రాజ్యంగ సవరణ చేస్తుందో లేదో కేంద్రమే చెప్పాలి. మనం చట్టం చేసి పంపించాం. కాపుల రిజర్వేషన్లపై జగన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాడు. ఇక రాష్ట్ర సమస్యలపై వైఎస్సార్ సీపీ, జనసేన పార్టలు కేంద్రాన్ని నిలదీయడం లేదు.’ అని విమర్శించారు.

English Title
Yanamala ramakrishnudu Pressmeet In amaravati
Related News