ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో వాటా పొందిన యస్ బ్యాంక్

Updated By ManamWed, 03/14/2018 - 23:18
yes-bank

yes-bankన్యూఢిల్లీ: తాకట్టులో ఉన్న దాదాపు 9 కోట్ల షేర్ల ఇన్‌వొకేషన్ అనంతరం ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 17.31 శాతం వాటాను యస్ బ్యాం క్ చేజిక్కించుకుంది. కంపెనీకి చెందిన రూ. 10 నామమాత్రపు విలువ కలిగిన 8,97,81,906 ఈక్విటీ షేర్లను యస్ బ్యాంక్ కైవసం చేసుకుంది. బ్యాంకు ఇచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించడంలో ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు విఫలవుయ్యాయి. దాంతో ఆ షేర్లు బ్యాంకు వశమయ్యాయని ఫోర్టిస్ హెల్త్‌కేర్ బి.ఎస్.ఇకి తెలియజేసింది. ఈ షేర్లను యస్ బ్యాంక్ ఫిబ్రవరి 16న దత్తం చేసుకుంది. కంపెనీ ప్రమోటర్లు మల్వీందర్ మోహన్ సింగ్, షివేందర్ మోహన్ సింగ్‌లు ఆగస్టు 31కి ముందు బ్యాంకుల వద్ద తాకట్టుపెట్టిన షేర్ల అమ్మకంపై విధించిన స్టేని సుప్రీం కోర్టు ఫిబ్రవరి 15న ఎత్తి వేసింది. ఫలితంగా, యాక్సిక్ బ్యాంక్, యస్ బ్యాంక్‌తో సహా ఫైనాన్షియల్ సంస్థలు తమ వద్ద తాకట్టులో ఉన్న షేర్లను విక్రయించే అవకాశం ఏర్పడింది. సింగ్ సోదరులు, వారి కుటుంబానికి చెందిన ఇతర సంస్థలకు ప్రమోటర్ సంస్థ ఫోర్టిస్ హెల్త్‌కేర్ హోల్డిం గ్స్‌లో ఉన్న వాటా ఇంతకుముందున్న 34.43 శాతం నుంచి 5.87 శాతానికి తగ్గింది. 

Tags
English Title
Yes Bank of Fortis Healthcare
Related News