మీ చర్యలు నన్నేం వెనక్కి నెట్టలేవు

Updated By ManamSat, 04/14/2018 - 09:59
Prakash Raj

Prakash raj బెంగళూరు: గురువారం రాత్రి ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్‌ కారును చుట్టుముట్టిన కొంతమంది బీజేపీ వాదులు అతడికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం ఓ కార్యక్రమంలో స్పందించిన ప్రకాశ్ రాజ్.. ‘‘మీ చర్యలు నన్నేం వెనక్కి నెట్టలేవు. నన్ను ఇంకా బలవంతుడిని చేస్తాయి’’ అంటూ పేర్కొన్నారు.

నేరస్థులను ఈ ప్రభుత్వం ఎందుకు రక్షిస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్న ప్రకాశ్ రాజ్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రజలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక ప్రజలను ఎలా ఫూల్స్ చేయాలని ఇద్దరు పేరు మోసిన నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శలు కురిపించారు.

English Title
You cannot discourage me
Related News