భారీగా తరలిరావాలి

Updated By ManamSun, 08/19/2018 - 00:55
chandrababu
  • ఈ నెల 28న గుంటూరులో వైునార్టీ సభ

  • వైునార్టీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి

  • వారి జీవన ప్రమాణాల్లో ఎంతో మార్పు వచ్చింది

  • టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్

chandrababuఅమరావతి: ‘‘నారా హమారా టీడీపీ హమారా’’ నినాదంతో ఈ నెల 28వ తేదీన గుంటూరులో జరిగే మైనార్టీ సభకు మైనార్టీ సోదర సోదరీమణులు ఉత్సాహంగా పాల్గొనేలా జిల్లాల్లో పార్టీ నాయకులు కృషి చేయాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ నేతలు, పార్టీ ముఖ్యులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి వల్ల వైునార్టీల జీవన ప్రమాణాల్లో ఎంతో మార్పు తెచ్చింద న్నారు. మైనార్టీల అభ్యున్నతికి, పేదరిక నిర్మూనలకు నిరుద్యోగాన్ని రూపు మాపేందుకు ప్రభుత్వం నాలుగేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.200 కోట్లు ఉన్న మైనార్టీ బడ్జెట్ ప్రస్తుతం రూ.1000 కోట్లకు పైగా పెంచామన్నారు. మైనార్టీల్లో పెళ్లి చేసుకున్నవారికి ఇచ్చే దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి పథకాల వల్ల మైనార్టీలకు, టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ధైర్యం నింపగలిగామని పేర్కొన్నారు. విజయవాడ, కడపల్లో హజ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. పేదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించేందుకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో పెద్ద మొత్తాన్ని స్కాలర్‌షిప్స్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ల కోసం కేటాయిస్తోందని చెప్పుకొచ్చారు. మక్కా దర్శించుకునే హజ్ యాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక చొరవ చూపుతున్నామన్నారు. మేనిఫెస్టోలో హామీ మేరకు ఇమామ్‌కు రూ.5,000, మౌజన్‌లకు రూ. 3,000 గౌరవవేతనం ప్రకటించి వారిని సముచితంగా గౌరవించామని చంద్రబాబు పేర్కొన్నారు.

సుప్రీంకు మెడికల్ సీట్ల వివాదం
మెడికల్ కాలేజీలలో సీట్ల ఎంపికలో రిజర్వేషన్ అభ్యర్థులకు స్వేచ్ఛ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల ఎంపిక రిజర్వేషన్ అభ్యర్థుల నిర్ణయానికి వదిలేయాలని 2001లో ఇచ్చిన జీవో 550 అమలుకు ఎదురైన ఇబ్బందులపై చర్చించారు. మెడికల్ కాలేజీల ఎంపికలో స్వేచ్ఛను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు నష్టదాయకంగా పరిణమిస్తోందని రిజర్వేషన్ అభ్యర్థులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి ఈ అంశాలను సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని అధికారులకు సీఎం సూచించారు.  జీవో 550 ప్రకారం గతంలో రిజర్వేషన్ అభ్యర్థులకున్న అనుకూల పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం, ప్రభుత్వం తరఫున రెండు పిటిషన్లను వేర్వేరుగా సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. ఈ నెల 30 లోపు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టులో సమగ్రంగా వాదించి రిజర్వుడు విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ప్రయత్నాలు సాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

English Title
You have to move heavily
Related News