మీరు ఇక్కడనుంచే పోటీ చేయ్యాలి సారూ

Updated By ManamFri, 09/07/2018 - 22:42
kcr
  • లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం

  • 4 ఏండ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి  పనులు చేశారు

  • కేసీఆర్‌తో సమావేశమైన గజ్వేల్ ప్రజలు

kcrహైదరాబాద్: గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఎర్రబెల్లిలో ఆపద్ధ్దర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును కలిశారు. గజ్వేల్ నియోజకవర్గం నుండి మరొకసారి పోటీ చేయడానికి నిర్ణయిం చుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ ఈసారి తన నియోజకవర్గం మార్చుకుంటారని ప్రచారం జరిగిం దని, దీంతో తామంతా ఆందోళన  చెందామని వారు చెప్పారు. అవన్నీ అబద్ధాలేనని, గజ్వేల్ నుండి మరోసారి పోటీ చేస్తానని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడంతో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని వారన్నారు. గత నాలుగు సంవత్సరాలు గా గజ్వేల్ నియోజకవర్గంలో ఎవరు ఊహించని విధంగా అభివృద్ధి జరిగిందని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, కేసీఆ ర్ చేసిన అభివృద్ధికి ప్రతిఫలంగా ఈసారి కేసీఆర్‌ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని వారంతా ముక్తకంఠంతో చెప్పారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. గజ్వేల్ ను గత నాయకులు పొరంబోకు భూమిగా మార్చి అవసరం కోసం వాడుకున్నారు. గందరగోళంగా మారిన నియోజకవర్గాన్ని ఓ తొవ్వకు తెచ్చేందుకు ఇంత సమయం పట్టిందని ఆయన చెప్పారు. గజ్వేల్ బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవద్దన్నారు. ఇక్కడ జరిగింది ఛారానా వంతే... ఇంకా బారానా వంతు జరగాల్సి వుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమ య్యారు. గజ్వేల్ ప్రజల అభిష్టంతోనే మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. నాకు పదుర్ల జనం ఉన్నారని అందరితో కలిసి నామినేషన్ వేసి వెళ్తా నని నా గెలుపు నియోజకవర్గ ప్రజలు, పార్టీ వర్గాలకే అప్ప జెప్తున్నానన్నారు.  కొండ పోచమ్మ రిజర్వాయర్ గజ్వేల్ ప్రజలకు అన్నం పెడుతుందన్నారు. దాన్ని జూన్ లోగా నిర్మాణం పూర్తి చేసుకుని అన్ని చెరువుల్లో గోదావరి నీళ్లను నింపుకొని యేడాదికి మూడు పంటలు పండిచుకుందా మన్నారు. గజ్వేల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని.. పారిశ్రామిక కారిడార్ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరలో ఏర్పడతాయన్నారు. త్వరలో ఎన్నికలు జరుగుతాయని తిరిగి అధికారంలోకి టీఆర్‌ఎస్ పార్టీ మంచి మెజార్టీతో వస్తుందని స్పష్టం చేశారు.

Tags
English Title
You must compete here
Related News