వెంట్రుకంత సిత్రం..!

Updated By ManamFri, 02/09/2018 - 18:29
hair art
  • మనిషి జుట్టుతో అద్భుతమైన కళాఖండాలు.. కేరళకు చెందిన యువకుడి ప్రతిభ

hair artకళలకు కాదేదీ అనర్హమన్నట్టు.. కేరళకు చెందిన ఓ యువకుడు మనిషి వెంట్రుకలతో అందమైన చిత్రాలను అల్లే్స్తున్నాడు. కేరళలోని నెల్లిమూడు జిల్లా తంబూరుకు చెందిన 23 ఏళ్ల ఆర్ఆర్ మిథున్ ఈ అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నాడు. ఓ కళాశాలలో ఆర్కిటెక్చర్ చదువుతున్న మిథున్.. ఏడు నెలల క్రితమే ఈ కళను ప్రారంభించాడు. ఇప్పటిదాకా గొప్పగొప్ప వాళ్లయిన మహాత్మా గాంధీ, సచిన్ టెండూల్కర్ వంటి రూపు రేఖలను వెంట్రుకలతో అల్లాడు. వాళ్లవే కాదు.. అనేక చిత్రాలను గీశాడు. తన స్నేహితులు, తెలిసిన వాళ్లు దానం చేసిన జుట్టుతోనే ఇంతటి అద్భుతాలను సృష్టించాడు మిథున్. అయితే, అదేం అంత సులువైన పని కాదంటున్నాడు మిథున్. చిత్రాలుగా పేర్చడానికి ముందు.. అనుకున్న రూపు వచ్చేలా ఆ వెంట్రుకలను విభిన్న పరిమాణాల్లో కత్తిరించడం, వాటిని పలు రసాయనాలతో ట్రీట్ చేయడం వంటి పనులను మిథున్ చేశాడు. తన స్నేహితులిచ్చిన జుట్టు పాడవకుండా ముందు ఫార్మాల్డిహైడ్ ద్రావణాన్ని చల్లి ఓ 20-30 నిముషాల పాటు ఆరబెట్టేవాడినని చెప్పాడు. అనంతరం వాటిని అనుకున్న రూపు వచ్చేలా పలు పరిమాణాల్లో కత్తిరించి, సూదుల ద్వారా అమర్చేవాడినని చెప్పుకొచ్చాడు మిథున్. దానికి చాలా సహనం, సమయం అవసరమని అన్నాడు. అయితే, ఇలాంటి వాటిని అనుకరించడానికి ముందు దాని వల్లే ఎదురయ్యే పరిణామాలను తెలుసుకోవాలని మిథున్ సూచిస్తున్నాడు. అలర్జీలు, చర్మ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నాడు. కాబట్టి వాటిని చర్మానికి అంటుకోకుండా జాగ్రత్తగా చేయాలని సూచిస్తున్నాడు. ముక్కు, నోటికి ఏదైనా మాస్క్‌ను కట్టుకుని చేయాలని చెప్పాడు. 

English Title
This Young man Paves for Hair Art
Related News