‘అరవింద సమేత’ అదిరిపోతుంది అంతే: నిర్మాత

Updated By ManamTue, 08/14/2018 - 13:58
Aravindha Sametha

Aravindha Samethaఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా ఈ చిత్ర టీజర్‌ను బుధవారం ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నారు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌పై అటు అభిమానుల్లోనే కాకుండా, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ చాలా అంచనాలే ఉన్నాయి. వాటన్నింటిని మరింత పెంచేలా తాజాగా యువ నిర్మాత నాగవంశీ(సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల్లో ఒకరు) టీజర్‌పై ప్రశంసలు కురిపించాడు.

దీనిపై సోషల్ మీడియాలో పంచుకున్న నాగవంశీ.. ‘‘ఇప్పుడే అరవింద సమేత టీజర్‌ చూశాను. ఎన్టీఆర్ అభిమానిగా చెబుతున్నా, మీరు సిద్ధమైపోండి. మన ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు, దర్శకుడు త్రివిక్రమ్ గొప్పగా తెరకెక్కించారు. రేపు ఉదయం 9గంటలకు సిద్ధంగా ఉండండి’’ అంటూ పేర్కొన్నాడు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా.. హారిక అండ్ హారిక పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

English Title
Young Producer Naga Vamsi about Aravindha Sametha Teaser
Related News