నువ్వా..నేనా

Updated By ManamTue, 05/15/2018 - 01:06
ipl
  • ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా, రాజస్థాన్‌లకు చావోరేవో  

ఐపీఎల్‌లో ప్లే ఆఫ్  రేస్ మజా కొనసాగుతోంది.  ఇప్పటికే సkolkattaన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు  ప్లే ఆఫ్ బెర్త్‌లు ఖాయం చేసుకోగా, మరో రెండు స్థానాల కోసం పంజాబ్, నైట్ రైడర్స్, రాజస్థాన్, ముంబై జట్లు పోటీపడుతున్నాయి.  ఈ నాలుగు జట్లలో ప్లే ఆఫ్‌కు చేరేవి రెండు జట్లే.. దీంతో ఐపీఎల్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా మారాయి.

కోల్‌కతా: ఐపీఎల్‌లో మనుగడ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్లు తలపడనున్నాయి. మంగళవారమిక్కడ జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లో బలంగా దూసుకొస్తున్న ఆర్‌ఆర్‌తో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కేకేఆర్ తలపడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలిన ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్ల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన జట్టు ఇక నిష్క్రమించక తప్పదు. 12 పాయింట్లతో ఇరు జట్లూ నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోగా ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ హోరా హోరీగా పోరాడనున్నాయి. లీగ్ దశ ముగుస్తున్న సమయంలో ఈ రెండు జట్లూ పుంజుకోవడంతో అర్హత పోటీ మరింత కఠినంగా మారింది. వరుస మ్యాచ్‌లతో వెనకబడిన కేకేఆర్ జట్టు గత మ్యాచ్‌లో ఐపీఎల్‌లోనే నాల్గవ అత్యధిక స్కోరు 245/6 నమోదు చేసింది. అంతేకాదు ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి కింగ్స్ లెవెన్ పంజాబ్‌ను 31 పరుగులతో చిత్తు చేసింది. ఎలిమినేషన్ అంచున నిలిచిన ఆర్‌ఆర్ జట్టు కూడా వరుసగా మూడు విజయాలతో పుంజుకుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో జోస్ బట్లర్ ఒంటరి పోరుతో జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ అజేయ 94 పరుగులు చేయడంతో ఆర్‌ఆర్ జట్టు 7 వికెట్లతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌కు చెందిన ఈ వికెట్‌కీపర్/ బ్యాట్స్‌మన్‌కు ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ. దీంతో ఐపీఎల్ రికార్డుల్లో  వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. బట్లర్ గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసిన స్కోర్లు చూస్తే 67, 51, 82, 95 (నాటౌట్), 94 (నాటౌట్)గా ఉన్నాయి. బట్లర్‌తో పాటు బెన్ స్టోక్స్ కూడా కేకేఆర్‌కు ప్రమాదకరంగా మారనున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో స్టోక్స్ వివిధ స్థానాల్లో ఆడి మెప్పించాడు.

వీళ్లద్దరిని గనుక కట్టడి చేయగలిగితే దినేష్ కార్తీక్ నేతృత్వంలోని కేకేఆర్ సగం పోరు గెలిచినట్టే. ఆర్‌ఆర్ బలహీనతలను బాగా తెలుసుకున్న కార్తీక్ స్పిన్‌తో తమ ప్రత్యర్థిని దెబ్బతీయాలని భావిస్తున్నాడు. ఆర్‌ఆర్ కెప్టెన్ అజింక్య రహానే ఫామ్‌లో లేకపోవడం కేకేఆర్‌కు కలిసొచ్చే అంశం. రౌండ్ రాబిన్ లీగ్ దశలో ఈ మ్యాచ్ కోల్‌కతాకు చివరి హోం మ్యాచ్. దీంతో హోం గ్రౌండ్ మ్యాచ్‌లను గెలుపుతో ముగించాలని కేకేఆర్ పట్టుదలగా ఉంది. ఎలిమినేటర్, రెండో ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ఈడెన్ గార్డెన్ ఆతిథ్యమివ్వనుంది. ఒకవేళ పాయింట్ల పట్టికలో మూడు లేదా నాలుగో స్థానంలో కేకేఆర్ నిలిస్తే మరోసారి హోం గ్రౌండ్‌లో ఆడే అవకాశం ఆ జట్టు కు లభిస్తుంది. రహానే 12 మ్యాచ్‌ల్లో 280 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సత్తా చాటేందుకు, కెప్టెన్‌గా జట్టుకు అండగా నిలిచేందుకు రహానేకు ఇదే చివరి అవకాశం. మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.

సునీల్ నరైన్, దినేష్ కార్తీక్, యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇండోర్‌లో భారీ స్కోరు సాధించిన మ్యాచ్‌లో సరైన్ 36 బంతుల్లో 75 పరుగులు, కార్తీక్ 23 బంతుల్లో 50 పరుగులు చేశారు. బ్యాట్‌తో, బంతితో రెచ్చిపోతున్న నరైన్ కేకేఆర్ జట్టుకు చాలా విలువైన ఆటగాడిగా మారాడు. ట్రినిడాడ్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్ మరోసారి కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నాడు. నరైన్ బౌలింగ్‌కు, బట్లర్ బ్యాటింగ్‌కు మధ్య జరగనున్న పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెప్టెన్ కార్తీక్ 46.37 సగటుతో మొత్తం 371 పరుగులు చేశాడు. కార్తీక్ కూడా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సత్తా చూపాలనుకుంటున్నాడు. ముఖా ముఖీ పోరులో ఈ రెండు జట్లూ 7-7తో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్ అభిమానులకు కన్నుల పండుగ కానుంది. 

English Title
your or me.. tuff fight
Related News