‘సెల్’ మోజులో యువత

Updated By ManamTue, 08/21/2018 - 00:40
mathanam

imageదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. ఈ దే శాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు యువతలోనే వున్నా యి. యువత తలచుకుంటే సా దించలేనిది ఏదీ లేదు. అన్న స్వామి వివేకానందుడి మాటలు విద్యార్థులకు ఎప్పటికీ శిరోధార్యం. అయితే టెక్నాలజీని తమ చ దువు, కెరీర్ కోసం కాకుండా కేవలం కాలక్షేపానికి వినియోగిస్తూ ఎందరో విద్యార్థులు తమ భవిష్యత్తును, ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. సెల్‌ఫోన్లపై విపరీతైమెన వ్యామోహమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఫేస్‌బుక్, వాట్సాఫ్, యూట్యూబ్, ట్వి ట్టర్ వివిధ యా ప్‌లు సోషల్ మీడియాలో అనునిత్యం విహరిస్తూ చాలామంది యువతీ యువకులు పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి పెడదారి పడుతున్నారు. ఉన్నత చదువులకు మంచి ఉద్యోగాలకు గతంలో కంటే ఇప్పుడు అవకాశాలు దండిగా పెరిగాయి. ప్ర భుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలనే తేడా లేకుండా చాలాచోట్ల విద్యార్థులలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది విద్యార్థులు తరగతులకు గైర్హాజరు అవుతూ సినిమాలు, షికార్లు, బైక్ రైడింగ్‌లు, పార్టీల పేరుతో చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు.

మరికొంత మంది క్యాంటీన్లలో, ఏకాంత ప్రదేశాలలో ప్రేమల పేరి ట స్వేచ్ఛగా విహరిస్తూ కబుర్లు చెప్పుకుంటూ విలుైవెన కాలాన్ని వృధాచేస్తున్నారు. కాలేజీ అధ్యాపకులు ఇదేమని ప్రశ్నిస్తే వారిైపెకి ఎదురు తిరగడం,తల్లిదండ్రులు మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం సర్వసాధారణైమెంది. నేటి యువత వక్రమా ర్గం పట్టడానికి ప్రధాన కారణం సెల్‌ఫోన్‌లు కాలేజీ ఫీజు చెల్లించడానికి డబ్బులు లేకున్నా వేలాది రూపాయలు వెచ్చించి వివిధ రకాల ఆండ్రాయిడ్ ఫోన్‌లను కొనడం, వానిలో డేటాకార్డులు వేసి నిత్యం వాట్సాఫ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్‌లను వాడడం పరిపాటిగా మారింది. మరికొందైరెతే ఫోర్న్ చిత్రాలు, నీలిచిత్రాలను చూడడం, అసభ్యకరైమెన మెసేజ్‌లు పంపడం, ఛాటింగ్‌ల పేరుతో రాత్రివేళ కాలక్షేపం చేస్తూ తగినంత నిద్రకు దూరమవుతున్నారు. వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లలో వివిధ సమాచారాలను, ఫోటోలను, తమ సెల్ఫీలను పోస్టు చేసి తమకు ఎన్ని లైకులు, షేర్‌లు, కామెంటులు వచ్చాయో చూసుకోవ డం అలవాటుగా మారింది. కొందైరెతే కాలేజీలకు వెళ్లినా ఎ ప్పుడూ ‘నెట్’ ఆన్‌లోనే పెడుతూ అధ్యాపకులు పాఠాలు బోధిస్తు న్నా పెడచెవిన పెట్టి సెల్‌ఫోన్‌తోనే ఆడుకుంటున్నారు. ఇయుర్ ఫోన్ లు పెట్టుకుని బైక్‌లపై రయ్యమని దూసుకుపోతూ ప్రమాదాలు కొ ని తెచ్చుకుంటున్నారు.  

గతంలో ప్రతి ఇంటిలో ఒక సెల్‌ఫోన్ మాత్రమే వుండేది. ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది సభ్యులు వుంటే అందరిimage చేతులలో స్మార్ట్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. విద్యార్థులే కాదు, వివిధ వర్గాల వారు సెల్‌ఫోన్ కంపెనీలు ఇచ్చే రాయితీలు ఉచిత డేటా కోసం ఎగబడడం చూస్తూనే వున్నాము. గంటల తరబడి ఫోన్ వాడుతున్నందున చాలామంది విద్యార్థులు యువతలో కంటి, చెవి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. ఫోన్లకు దాసోహైవెుపోతున్న యువతీయువకు లు తమ కుటుంబాలను, పరిసరాలను కూడా పట్టించుకోవడం లేదు. కనీసం వార్తాపత్రికలను సైతం చదివేందుకు తీరిక దొరకడం లేదు. విజ్ఞానాన్ని పెంచుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన యువత సెల్‌ఫోన్ మోజులో వ్యసనాలకు బానిసలు కావడం ఆం దోళనకర పరిణామం.

ఇటీవల చెన్నై నగరం సమీపంలో ఓ యువకుడు, యూట్యూబ్ చూస్తూ తన సతీమణికి ప్రసవం చేస్తూ ఆమె మృతికి కారకుడిగా నిలిచాడు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రైవేటు కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు కూడా నిత్యం అధికంగా వాట్సాఫ్ వాడుతున్నారు. సెల్‌ఫోన్ వాడడం వల్ల అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయి. బస్‌‌రైడెవర్లు కూడా బస్‌లను నడిపిస్తూ సెల్‌ఫోన్‌లు మాట్లాడుతున్నారు. సెల్‌ఫోన్ వాడకం మితిమీరుతున్నందున ఆ ప్రభావం మెద డు పనితీరుపై పడుతుందని, భావోద్వేగాలకు గురవుతున్నారని, మానసిక ప్రవర్తనలోను మా ర్పులు వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గిద్దాం అవసరైమెన మీరకే వాడదాం. ఆరోగ్యకర జీవితాన్ని గడుపుదాం!

- కామిడి సతీష్‌రెడ్డి
9848445134 

English Title
Youth in the 'cell' fobia
Related News