ఎంపీల రాజీనామాలపై జగన్ సంచలన ప్రకటన

Updated By ManamTue, 02/13/2018 - 17:27
ys jagan

ys jaganనెల్లూరు: ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఆందోళనను ఉదృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీల రాజీనామాలపై వైఎస్ జగన్ ఓ ప్రకటన చేశారు. ఏప్రిల్ 6వరకూ పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీల ఆందోళన కొనసాగుతుందని, అప్పటికీ కేంద్రం తమ పోరాటంపై స్పందించకపోతే అదే రోజు తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. మార్చి 1 నుంచి తమ పార్టీ తరపున హోదా కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జగన్ తెలిపారు. మార్చి 3న తాను పాదయాత్ర చేసే ప్రాంతానికి పార్టీ నేతలు వస్తారని, అక్కడ నుంచి జెండా ఊపి పోరాటాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. మార్చి 5నుంచి ఏప్రిల్ 6వరకూ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ ఎంపీలు హోదా కోసం గళాన్ని వినిపిస్తారని, పోరాటం చేస్తారని జగన్ తెలిపారు. ఏప్రిల్ 6వరకూ కేంద్రానికి గడువు ఇస్తున్నామని, అప్పటికీ ఎలాంటి స్పందన లేకపోతే పార్టీ ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. జగన్ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

English Title
ys jagan comments on mps resigns
Related News