విశాఖలోకి జగన్ ఎంట్రీ

Updated By ManamTue, 08/14/2018 - 13:09
Jagan Mohan Reddy

Jagan Mohan Reddyవిశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ రోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించగా.. నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని నాతవరం మండలం గన్నవరం మెట్టు గ్రామంలోకి అడుగుపెట్టడం ద్వారా విశాఖ జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, నేతలు గుడివాడ అమర్ నాథ్, వరదు కల్యాణి తదితరులు జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. కాగా మంగళవారం జగన్ పాదయాత్ర 237రోజుకు చేరింది. 

English Title
YS Jagan Mohan Reddy Padayatra enter into Vishakapatnam
Related News