231వ రోజు జగన్ పాదయాత్ర సాగనుందిలా

Updated By ManamTue, 08/07/2018 - 09:30
Jagan

Jagan తూర్పుగోదావరి: ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 231వ రోజుకు చేరింది. పాదయాత్రలో భాగంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం శివారు నుంచి తన నడకను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి శంఖవరం, శృంగవరం, బంగారయ్యపేట మీదుగా రౌతులపూడి వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమౌతున్న జగన్, వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాగా జగన్ ఇప్పటివరకు 2666.9 కిలోమీటర్లు నడిచారు. 

English Title
YS Jagan Padayatra reached 231th day
Related News