జగన్‌ కోసం విశాఖ వాసుల ఎదురుచూపు!

Updated By ManamSun, 08/12/2018 - 18:38
YS Jagan Praja Sankalpa Yatra

YS Jagan Praja Sankalpa Yatra to enter Vizag on August 14

విశాఖపట్నం‌: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైసీపీ అధిపతి, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రజా సంక‌ల్ప యాత్ర’ ఈ నెల 14వ తేదీ విశాఖ‌లోకి అడుగుపెడుతుంద‌ని పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శీల ర‌ఘురామ్‌, వైసీపీ నేత గుడివాడ అమ‌ర్‌నాథ్ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఈ వివరాలు వెల్లడించారు. జ‌న‌నేత రాక‌కోసం జిల్లా వాసులు ఆశ‌గా ఎదురుచూస్తున్నారని అమర్ చెప్పుకొచ్చారు.నర్సీపట్నం నియోజకవర్గంలోని గన్నవరం మెట్టు నుంచి జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర మొదలు కానుంది. అక్కడి నుంచి శరభవరం ఎల్లవరం, దొండపేట, ములగపూడి, బెన్నవరం, నయ్యపురెడ్డిపాలెం, నర్సీపట్నం మీదుగా.. పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఈ నియోజకవర్గంలో యండపల్లి, సుంకపూరు, కోటవురట్ల, గొట్టివాడ, ములగల్లోవ, దార్లపూడి, ఏటికొప్పాక మీదుగా సాగతుంది. 

అనంతరం యలమంచిలి నియోజకవర్గంలో ప్రవేశించనున్న పాదయాత్ర పులపర్తి, పురుషోత్తపట్నం, రేగుపాలెం, యలమంచిలి, అచ్యుతాపురం, కొండకర్ల జంక్షన్, హరిపాలెం, తిమ్మరాజుపేట, మునగపాక మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మపాలకు చేరుకుంటుంది. తుమ్మపాల మీదుగా బావులపాడు, మామిడిపాలెం, గంధవరం, వెంకన్నపాలెం మీదుగా చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గోవాడ, గణపతినగరం, చోడవరం మీదుగా రేవళ్లు, గౌరవరం, కొత్తవూరు, ఎ.భీమవరం, పొడుగుపాలెం, ఎ.కోడూరు, సూరెడ్డిపాలెం, సింగరెడ్డిపాలెం మీదుగా మాడుగుల నియోజకవర్గంలోకి పాదయాత్ర సాగుతుంది.

jagan reddy

ఈ నియోజకవర్గంలో కె.కోటపాడు, జోగన్నపాలెం, రామచంద్రపురం మీదుగా పెందుర్తి నియోజకవర్గంలోని గులిపల్లి, సబ్బవరం మీదుగా ప్రజాసంకల్పయాత్ర సాగతుంది.అక్కడి నుంచి విశాఖ నగర పరిధిలో జరిగే పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ త్వరలో ఖరారు కానుంద‌ని వెల్ల‌డించారు. యాత్రలో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్రలో పాదయాత్ర పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖ జిల్లాలో ఈనెల 14న అడుగుపెట్టనుండ‌టంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

English Title
YS Jagan Praja Sankalpa Yatra to enter Vizag on August 14
Related News