వై.ఎస్.ఆర్‌గా మమ్ముట్టి

Updated By ManamThu, 03/22/2018 - 02:53
Mammootty

Mammoottyఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీ॥శే॥ డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవిత కథను  సినిమాగా రూపొందిస్తున్నారు.  మహి.వి.రాఘవ్ దర్శకుడు. 70 ఎం.ఎం.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘యాత్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ ‘‘‘ఆనందో బ్రహ్మ’తో తమ సంస్థకు రెండో విజయాన్ని అందించిన మహి వి.రాఘవ్ డైరెక్షన్‌లో మరో సినిమాను నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ‘యాత్ర’ కోసం మహి రెడీ చేసిన లైన్ నచ్చడంతో సినిమాను ఈ సినిమాను నిర్మిస్తున్నాం. వైఎస్‌ఆర్ పాత్రలో నటించడానికి మమ్ముట్టి అంగీకరించడం చాలా ఆనందం కలిగించింది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆరాధించే నాయకుడు, ఎమోషనల్‌గా ప్రజలకు దగ్గరైన వ్యక్తి వైయస్. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తాం. త్వరలోనే ఈ బయోపిక్‌కి సంబంధించిన వివరాల్ని ప్రకటిస్తాం’’ అన్నారు.

Tags
English Title
YSR Mammootty
Related News