లోక్‌సభలో వైసీపీ వాయిదా తీర్మానం

Updated By ManamTue, 03/13/2018 - 11:57
YSRCP MPs, Loksabha, YV Subba reddy

YSRCP MPs, Loksabha, YV Subba reddy న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మంగళవారం లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభలో ప్రత్యేక హోదాపై సమగ్రంగా చర్చించాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ.. సభా కార్యకలాపాలను వాయిదా వేయాలని, ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విభజన హామీలపై టీడీపీ, తెలంగాణలో రిజర్వేషన్ల కోటా అంశంపై టీఆర్ఎస్ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి.

English Title
Ysrcp adjourned motion filed in loksabha
Related News