ప్రజలను పక్కదోవ పట్టిస్తున్న ఎల్లో మీడియా!

Updated By ManamSun, 08/05/2018 - 19:54
Jagan Comments On Yellow Media

Jagan Comments On Yellow Media

తూర్పుగోదావరి: టీడీపీ ప్రభుత్వ పై వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎల్లో మీడియా గురించి ఆయన ప్రస్తావించారు. " చంద్రబాబు నాలుగేళ్ల పాలన ఎలా ఉందో ఒకసారి చూడండి. ఉన్నదంతా పక్క దారి పట్టించే ప్రయత్నం తప్ప మరోకటి లేదు. ప్రకటనలు, ఎల్లోమీడియా సమస్యల నుంచి ప్రజలను పక్క దోవ పట్టించేందుకే ఆరాటం కనిపిస్తోంది. ప్రజలను దగ్గరుండి మోసం చేస్తారు. ఎన్నికలు ఆరునెలల్లో ఉన్నందున, ఎదుటి వారిని మోసం చేసేవారంటూ బాకా ఊదుతారు.

చంద్రబాబు అబద్దాలు, ఆడినా, మోసం చేసినా వీరికి కనిపించదు. ఆ పేపర్లు, ఆ టీవీల్లో కనిపించేదేమిటంటే.. చంద్రబాబు ఆహా ఇంద్రుడు, చంద్రుడు అయ్యా, ఆహా రైతులు, డ్వాక్రా మహిళలు కేరింతలు, కొడుతున్నట్లు, పిల్లలకు ఉద్యోగాలు వచ్చి డబ్బులు వచ్చి వాటిని ఎలా ఖర్చు చేయాలో తెలియకుండా ఉన్నారు అన్నట్లుగా చెపుతారు" అని కొన్ని మీడియా సంస్థల పేర్లు చెబుతూ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

English Title
YSRCP Chief Jagan Angry On Yellow Media
Related News