బాబుకు దిమ్మదిరిగే కౌంటరిచ్చిన జగన్!!

Updated By ManamSat, 04/14/2018 - 22:15
Jagan Vs Chandrababu

YSRCP Chief Jagan Counter Attack On CM Chandrababu

అమరావతి: కేంద్రం తీరుకు నిరసనగా ఏప్రిల్-20న ఒక రోజు నిరాహార దీక్ష చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన దీక్షచేపడతానని చెప్పడంపై ప్రతిపక్ష పార్టీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విజయవాడ పాదయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు దిమ్మదిరిగే కౌంటరిచ్చారు. మొదట చంద్రబాబు ఏం మాట్లాడారు..? జగన్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? అని ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబు మాటలు..
"
నేను పుట్టిన రోజు ఏప్రిల్-20న ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నాను. పార్లమెంట్ సరిగ్గా జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు దీక్ష చేశారు. సమావేశాలు సజావుగా జరగకుండా ఉండటానికి కారణం మీరే కదా. రాష్ట్ర సమస్యలపై.. కేంద్రం చూపే తీరుకు నిరసనగా నిరాహారదీక్ష చేస్తున్నాను" అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రి ఎక్కడైనా నిరాహార దీక్ష చేస్తారా? అని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాట అని సరిగ్గా 48 గంటలు ముగియక మునపే తాను నిరాహార దీక్షచేస్తున్నట్లు సీఎం ప్రకటించడం గమనార్హం.

జగన్ కౌంటర్ ఇదీ...!!
"
చంద్రబాబు పుట్టిన రోజున నిరాహార దీక్షచేస్తారట. ఆయన పుట్టిన రోజు ఎప్పుడో మీకు (ప్రజలకు) తెలుసా. ఏప్రిల్ -20. ఏప్రిల్ అంటే 4.. 20 అంటే 20.  మొత్తం కలిపితే 420. ఏప్రిల్ 20న ఆయన కొంగ జపం చేస్తారంట" అంటూ సీఎంకు జగన్ కౌంటరిచ్చారు.

English Title
YSRCP Chief Jagan Counter Attack On CM Chandrababu
Related News