చిలక.. గోరింకల్లా సంసారం చేసి ఇప్పుడేమో..!

Updated By ManamSat, 07/07/2018 - 17:59
YSRCP Chief Jagan Criticized CM Chandrababu In Ramachandrapuram Sabha

YSRCP Chief Jagan Criticized CM Chandrababu In Ramachandrapuram Sabhaతూర్పు గోదావరి: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో విజయవంతంగా జరుగుతోంది. శనివారం సాయంత్రం ఆయన రామచంద్రాపురలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం హాజరుకావడంతో పోటెత్తిపోతుంది. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు బీజేపీ-టీడీపీ చిలకా-గోరింకల్లా సంసారం చేశారన్నారు. ఆ నాలుగేళ్లు ఒకరినొకరు పొగిడేసుకుని.. ఎన్నికల ఆర్నెళ్ల ముందు విడాకులు తీసుకున్నారని దుయ్యబట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత ప్రజలు గుర్తొస్తారు.. ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ ఏవిధంగా పెట్టాలో బాబుకు గుర్తొస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

" ఎన్టీఆర్‌కు ఆయనే వెన్నుపోటు పొడిచి.. ఎన్నికలొచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి దండకూడా బాబే వేస్తారు. ఇలాంటి వ్యక్తి మనస్తత్వం ఎలాంటిదో మీకు(ప్రజలకు) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడాకులిచ్చిన పెద్ద మనిషి.. బయటికొచ్చినట్లు డ్రామాలేసి.. ఏపీకి న్యాం జరగాలంటే మరో ఐదేళ్లు తనకు అవకాశం ఇవ్వాలని కోరతారు. నిజంగా ఇటువంటి మోసం చేసే వ్యక్తిని ఏమనాలి..?. రైతుల రుణాలన్నీ బేషరుతుగా మాఫీ, బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి తెప్పిస్తామని ఈ పెద్ద మనిషే హామీ ఇచ్చి ఇప్పుడేమో మాటమారుస్తున్నారు.. ఈయన్ను నిజంగా ఏమనాలి మీరే (ప్రజలే) చెప్పండి?" అని చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు వర్షం కురిపించారు.

English Title
YSRCP Chief Jagan Criticized CM Chandrababu In Ramachandrapuram Sabha
Related News